
బజార్‌హత్నూర్(బోథ్): భూముల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. భూ సర్వే రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాలు లేకుండా, రెవెన్యూ గ్రామ ప్రజల సహకారంతో భూసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సంబంధిత అధికారులు స్థానికంగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. కోర్టు కేసులు, భూవివాదాలు ఉన్న వాటిని రెండవ విడతలో చట్టబద్ధంగా రికార్డులను పరిశీలించి సర్వే చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేందర్‌సింగ్, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, ఎంఆర్‌ఐ రాజేశ్వర్, జూనియర్ అసిస్టెంట్ వినోద్, వీఆర్‌వోలు పాల్గొన్నారు.