భూసార పరీక్షల ల్యాబ్‌ ఏర్పాటుకు సన్నాహాలు | land survey of soil testing lab | Sakshi

భూసార పరీక్షల ల్యాబ్‌ ఏర్పాటుకు సన్నాహాలు

Sep 23 2016 10:59 PM | Updated on Sep 4 2017 2:40 PM

భూసార ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ల్యాబ్‌లను జిల్లాలో 10 కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రార ంభించామని డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కష్ణమూర్తి పేర్కొన్నారు.

– డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కృష్ణమూర్తి
చిలమత్తూరు : భూసార ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ల్యాబ్‌లను జిల్లాలో 10 కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రార ంభించామని డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కష్ణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక మార్కెట్‌ యార్డు గోదామల సమీపంలో ల్యాబ్‌ ఏర్పాటు చేయడానికి అవసరమైన వసతులను పరిశీలించారు. గతంలో జిల్లాలో అనంతపురం, ధర్మవరం, పెనుకొండ ప్రాంతాల్లో మాత్రమే భూసార ప్రయోగశాలలు ఉండేవి.

ప్రస్తుతం రూ.28 లక్షలతో మడకశిర, ఉరవకొండ, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, హిందూపురం, కదిరి, గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి ప్రాంతాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఏడీఏ రోషన్‌ వలీ, ఇన్‌చార్జ్‌ ఏఓ సురేంద్రనాయక్,  ఏఈఓ మల్లికార్జున ఆయనతో పాటు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement