సకాలంలో భూముల రీ–సర్వే : కలెక్టర్‌ | Collector‌ Ordered Timely Land Re Survey | Sakshi
Sakshi News home page

సకాలంలో భూముల రీ–సర్వే : కలెక్టర్‌

Published Sat, Jun 11 2022 4:22 PM | Last Updated on Sat, Jun 11 2022 4:57 PM

Collector‌ Ordered Timely Land Re Survey - Sakshi

కశింకోట: సమగ్ర భూముల రీ–సర్వే సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి ఆదేశించారు. కశింకోట పొలాల్లో సర్వే, రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్న భూముల రీ–సర్వేను శుక్రవారం ఆయన అకస్మాత్తుగా పరిశీలించారు. రీ–సర్వే పూర్తి చేయడానికి ఆగస్టు నెలాఖరు వరకు సమయముందని, ఈలోగా నిబంధనలకు లోబడి సర్వే పూర్తి చేయాలన్నారు.

అనంతరం బయ్యవరం సచివాలయాన్ని సందర్శించి పనితీరును పరిశీలించారు. అక్కడ డిజిటల్‌ అసిస్టెంట్‌ నెల రోజులపాటు సెలవులో ఉండటంతో ప్రత్యామ్నాయంగా ఎవరినైనా తాత్కాలికంగా నియమించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో చిన్నోడు, తహసీల్దార్‌ బి.సుధాకర్, ఈవోఆర్‌డీ ధర్మారావు, ఆర్‌ఐ కిషోర్‌ కలెక్టర్‌ పర్యటనలో పాల్గొన్నారు.  

(చదవండి: టీవీ రిపోర్టర్‌నంటూ మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్‌ చేసి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement