సర్వే పురోగతిపై ఆరా తీస్తున్న కలెక్టర్ హరీశ్
వెల్దుర్తి(తూప్రాన్): మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములకు సంబంధించి బాధిత రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, త్వరలో అందరికీ న్యాయం చేస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అచ్చంపేట శివారులో కొనసాగుతున్న భూముల సర్వేను శనివారం రాత్రి పరిశీలించారు.
ఫోన్ టార్చి లైట్ వెలుగులో అటవీప్రాంతం మాదిరిగా ఉన్న భూముల్లోకి వెళ్లి సర్వే అధికారులు ఏర్పాటు చేసిన సబ్ డివిజన్ హద్దులను స్వయంగా పరిశీలించారు. సర్వే ప్రక్రియ మరో రెండు, మూడు రోజులు కొనసాగుతుందని, భూ కబ్జా ఆరోపణలపై నిజాలు బయటకు రావడానికి సమయం పడుతుందన్నారు.
అచ్చంపేట శివారులో సర్వే ప్రక్రియ సబ్ డివిజన్‌ల వారీగా దాదాపు పూర్తయిందని, ఈ విషయంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారిణి నివేదిక అందించాల్సి ఉందన్నారు. జమునా హేచరీస్ వ్యర్థాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై అధికారుల నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment