
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మ కంగా భూ సర్వే చేప ట్టిన ప్రభుత్వం.. భూ పరిపాలన అధికారి (సీసీఎల్‌ఏ)ని నియమించకుండా ఎందు కు నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సోమవారం ప్రశ్నించారు. ఇప్పటికీ సమగ్రమైన వ్యవ సాయ విధానాన్ని ప్రభుత్వం రూపొం దించలేకపోయిందని విమర్శించారు.
ట్రాక్టర్ల కొనుగోలు పథకంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చిందని ఆరోపిం చారు. వ్యవసాయ యంత్రాల రాయితీ కోసం రూ. 416 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. రూ. 56 కోట్లు మాత్రమే విడుదల చేసిందని దుయ్యబట్టారు. ఖరీఫ్ పూర్తయి, రబీ సమీపిస్తున్నందున వ్యవసాయ పనిముట్లను రైతులకు వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని చాడ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.