భూముల రీసర్వేకు కేంద్ర సాయం కోరాం
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
న్యూఢిల్లీ: నిజాం కాలం నాటి సర్వే రికార్డులే ఆధారంగా ఉన్న నేపథ్యంలో.. తెలంగాణ భూములపై మరోసారి సర్వే జరిపించేందుకు కేంద్ర సాయం కోరినట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆధ్వర్యంలో భూసేకరణ అంశంపై జరిగిన రాష్ట్రాల రెవెన్యూ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో భూములన్నింటినీ రీసర్వే జరిపించాలనుకుంటున్నారని.. ఇందుకు దాదాపు రూ. 600 కోట్లు అవసరమవుతుందని, కేంద్ర నిధులు కేటాయించాలని గడ్కారీని కోరినట్టు వివరించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల విషయంలో అక్రమాలు జరిగినందునే ప్రభుత్వం తగిన రీతిలో స్పందిస్తోందన్నారు.