
టీఆర్‌ఎస్ నేతలతో భూసర్వేనా
పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: అత్యంత కీలకమైన భూముల సర్వేను కేవలం టీఆర్‌ఎస్ నేతలతో పూర్తి చేస్తారా అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రైతు సంఘాలను కేవలం టీఆర్‌ఎస్ రైతు సంఘాలుగా చేయాలని చూస్తున్నారన్నారు. సర్వే పేరిట నామినేటెడ్ కమిటీలను వేసి, గ్రామాల్లో కొత్త వివాదాలను సృష్టిస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ముతో సర్వే చేయిస్తూ టీఆర్‌ఎస్ నేతలను పర్యవేక్షకులుగా పెడతారా అని పొంగులేటి ధ్వజమెత్తారు.