తుమృకోట (రెంటచింతల): తుమృకోట గ్రామ సమీపంలో ఉన్న అన్ సర్వే లాండ్ పోరంబోకు భూములను శుక్రవారం గురజాల ఆర్డీవో అరుణబాబు, జిల్లా సర్వే అధికారి కెజియాకుమారి, తహశీల్దార్ ఎన్‌వీ ప్రసాద్, అటవీ అధికారులు సందర్శించారు. సుమారు 1500ఎకరాల్లో సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకుగాను కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశాల మేరకు ఈ భూములను పరిశీలించారు. గ్రామపరిసరాల్లో సుమారు రెండు వేల ఎకరాలు సర్వే చేయకుండా ఉన్న భూములను నలుగురు సర్వేయర్లు, మరో నలుగురు అటవీ సిబ్బందితో కలసి రెండు బృందాలుగా ఏర్పడి మూడు రోజుల్లో ఆ భూములను కొలిపించి నివేదిక అందించాలని ఆర్డీవో కోరారు.
సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసినట్లయితే మండలంలోని అన్ని గ్రామాల్లో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించవచ్చన్నారు. ఈ ప్రభుత్వ పోరంబోకు భూముల్లో ఈ ఏడాది పంటలను సాగు చేయవద్దని గ్రామంలో దండోరా వేయించారు. భారీ ప్రాజెక్టును ఇక్కడే ఏర్పాటు చేసినట్లయితే మండల ంతోపాటు పలనాడు ప్రాంతానికి మేలు జరిగే అవకాశం ఉంది. కార్యక్రమంలో వీఆర్వో ఎస్‌విఎన్ మల్లికార్జునరావు, సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సోలార్ విద్యుత్తు ప్రాజెక్టు కోసం భూముల పరిశీలన
Published Sat, Aug 9 2014 2:55 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement