సోలార్ పవర్ రీజియన్‌గా జిల్లా | District can developed as Solar Power Region | Sakshi
Sakshi News home page

సోలార్ పవర్ రీజియన్‌గా జిల్లా

Published Sat, Aug 9 2014 2:48 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM

సోలార్ పవర్ రీజియన్‌గా జిల్లా - Sakshi

సోలార్ పవర్ రీజియన్‌గా జిల్లా

సాక్షి, గుంటూరు:  రాష్ట్రంలో గుంటూరు జిల్లా ‘సోలార్ పవర్ రీజియన్’గా మారబోతోంది.  ఈ మేరకు నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాయలంలోని తన చాంబర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సదస్సు వివరాలను వెల్లడించారు.

అవి...
* సోలార్‌పవర్ రీజియన్‌ను గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు  గురజాల- రెంటచింతల మధ్యలో ప్రభుత్వ భూములను గుర్తించాలి.
* ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ లింక్ చేయాలి.
* మీ సేవల్లో మొత్తం 283 సేవలుండగా ఇందులో 112 సేవలను అసలు ప్రజలు వినియోగించుకోవడం లేదు. మీసేవల్లో అందే అన్ని సేవలను సద్వినియోగం చేసుకొనేలా ప్రణాళికలు రూపొందించాలి.
* పట్టాదారు పాసుపుస్తకాల జారీ, పాసుపుస్తకాల్లో మార్పులు, చేర్పులు, టైటిల్ డీడ్స్ జారీ చేయడంలో జిల్లా పదవ స్థానంలో ఉంది. దీన్ని మెరుగుపరుచుకొని త్వరితగతిన పాసు పుస్తకాలు జారీ అయ్యేలా చూడాలి.
* జిల్లాలో వరి, పత్తి పంటలను అభివృద్ధి చేయాలి. అలాగే మిరప, అరటి, చేపల పెంపకం, పాడి, పౌల్ట్రీ పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్నారు.
* నాగార్జునసాగర్ నీటిని తాగు, సాగుకు వినియోగించుకోవాలని సూచించారు.
* పులిచింతలప్రాజెక్టులో 11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా చూడాలి.
* పులిచింతల నిర్వాసితులకు పరిహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
* అలాగే నగరాలు, పట్టణాల్లో సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్, తాగునీరు, పచ్చదనం వంటి అంశాలపై దృష్టి సారించాలి.
* గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటిగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలి.
* మంచినీటి సమస్య, పారిశుధ్యం, అండర్‌గ్రౌండ్‌డ్రైనేజీ వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
* జిల్లాలో టూరిజంను సర్వీస్‌సెక్టారుగా పెట్టుకొని అందుకోసం కొన్ని భూములను గుర్తించాలి. అమరావతిలో బుద్ధస్తూపంతో పాటు, బీచ్ రీసార్ట్స్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి.
* నిజాంపట్నం ఓడరేవును పోర్టుగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
* జిల్లాలో ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు వీలుగా భూములు గుర్తించాలి.
* జిల్లాలో టెండర్లు నిర్వహించిన రెండురీచ్‌లు మినహా మిగతా వాటిని డ్వాక్రా గ్రూపులకు అప్పగించి కలెక్టర్, ఎస్పీలు వారికి సపోర్టుగా ఉండాలి.
* చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిని పది లేన్లుగా విస్తరించేందుకు భూసేకరణ చేపట్టాలి.
* సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించినట్టు కలెక్టర్ కాంతిలాల్‌దండే వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement