ఎర్రగుంట్ల: యాబై సంవత్సరాలుగా నివసిస్తున్న తమ ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇవ్వడంతో ఆందోళన చెందిన ప్రజలు బుధవారం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎర్రగుంట్లలో 173 కుటుంబాల వారు యాభై ఏళ్లుగా పట్టాలు పొంది ఇల్లుకట్టుకుని ఉంటున్నారు. అయితే వాళ్లు ఉంటున్న స్థలం పొరంబోకు స్థలమని, వారంరోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేయకపోతే కూల్చివేస్తామని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు. దాంతో స్థానికులుతమవద్ద పట్టాలు ఉన్నాయని, యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ భూమి పొరంబోకు భూమి అనడం విడ్డూరంగా ఉందన్నారు. తమకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది స్థానికులు బుధవారం ఆందోళనకు దిగారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ధర్నా విరమించమని ఆందోళన చేపట్టారు.