ఖమ్మం అర్బన్: ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రీయలో భాగ ంగా రెవెన్యూ యంత్రాంగం ఆదివారం సాయంత్రం వదరకు సమగ్ర సర్వే నిర్వహించారు. మొత్తం 17 రెవెన్యూ గ్రామాల్లో 102 మంది అధికారులతో రెండురోజులు పాటు నిర్వహించారు. పలు గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్, చెరువులకు సంబంధించిన భూములు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించి ఆ నీవేదికలను ఆర్డీఓ సంజీవరెడ్డికి అందజేశారు. సర్వేలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాల పరిధిలో 102 మంది సిబ్బంది పాల్గొన్నారు. శనివారం చేపట్టిన సర్వేలో వీవీపాలె లో ఒక ఎకరం ప్రభుత్వ భూమిని సర్వే అధికారులు గుర్తించారు.
చిమ్మపుడిలో 11 ఎకరాలు, శివాయిగూడెంలో ఐదెకరాలకు పైగా, రేగులచెలకలో ఇనాం భూమికి సంబంధించి సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధితో పాటు అనుకొని ఉన్న రెవెన్యూ గ్రామాలైన వీవీపాలెం, బల్లేపల్లి, రఘునాథపాలెం, కోయచెలక, వెలుగుమట్ల, ధంసలాపురం, ఖానాపురం తదితర రెవెన్యూ గ్రామాల్లో అత్యంత విలువైన భూముల ఆక్రమణలు కొన్ని వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది.
దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ భూములలో ఆక్రమణ చేసి నిర్మాణాలు చేసిన వారిలో సర్వేతో భయం పట్టుకుంది. ఈసర్వే కోసం జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో పని చేసే రెవెన్యూ ఉద్యోగులను రెండురోజుల సర్వే కోసం రప్పించి సర్వేను చేయించారు. జేసీ సురేంద్రమోహన్, ఆర్డీఓ సంజీవరెడ్డి, తహశీల్దార్ వెంకారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు సర్వే తీరును గ్రామాల్లోకి పరిశీలించారు.
ముగిసిన భూసర్వే
Published Mon, Sep 29 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM
Advertisement