ఇబ్రహీంపట్నం: నగరానికి సమీపం లోని ఇబ్రహీంపట్నంలో అతి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాదారుల గుప్పిట్లోకి వెళ్తున్నాయని, దీనిపై సీబీసీఐడీతో విచారణ జరి పించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసి ప్లాట్లు చేస్తున్న విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తుంటే..మన రాష్ట్రంలో ఆర్టీసీని కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవకుంటే మంత్రులకు పదవులుండవని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించడాన్ని ఖండించారు. నిజామాబాద్‌లో ఎంపీ స్థానానికి ఆయన కూతురు కవిత ఓడిపోయినప్పుడు కేసీఆర్ ఎందుకు తన పదవికి రాజీనామా చేయలేదని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment