తెలంగాణలో విలువైన ప్రభుత్వ భూముల వేలం | Telangana government decides to auction lands | Sakshi
Sakshi News home page

తెలంగాణలో విలువైన ప్రభుత్వ భూముల వేలం

Published Sat, Jan 3 2015 6:58 PM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

తెలంగాణలో విలువైన ప్రభుత్వ భూముల వేలం

తెలంగాణలో విలువైన ప్రభుత్వ భూముల వేలం

హైదరాబాద్: విలువైన ప్రభుత్వ భూములు వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వివాదాలులేని విలువైన ప్రభుత్వ భూములు గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  రాజీవ్ శర్మ 10 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీలైనంత త్వరగా భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేయాలని ఆయన కలెక్టర్లను కోరారు. ప్రభుత్వ భూముల వేలం విషయాన్ని అత్యంత ప్రాధాన్యం గల అంశంగా గుర్తించాలని రాజీవ్ శర్మ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement