చండీగఢ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో అల్లర్లు చెలరేగిన తర్వాత అక్కడి ప్రభుత్వం బుల్‌డోజర్ యాక్షన్‌కు దిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ చర్యలను నిలిపివేయాలని హర్యానా, పంజాబ్ హైకోర్టులు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. దీంతో బుల్‌డోజర్‌తో బవనాల కూల్చివేత చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కూల్చివేత చర్యలను నిలిపివేయాలని రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్కట సంబంధిత అధికారులను ఆదేశించారు.
హర్యానాలో మతపరమైన ఘర్షణలు చెలరేగిన అనంతరం ఈ వ్యవహారాన్ని కోర్టు సుమోటుగా తీసుకుని విచారణ చేపట్టింది. బుల్‌డోజర్ యాక్షన్‌లో ఇప్పటివరకు 350 గుడిసెలు, 50 సిమెంట్ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే.. ప్రభుత్వ చర్య రాజకీయంగా విమర్శలకు దారితీసింది. ఓ వర్గాన్ని లక్ష‍్యంగా చేసుకుని కూల్చివేతలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తాము అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్‌లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే నాలుగు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు.
విశ్వ హిందూ పరిషత్ రథయాత్రపై కొందరు అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడంతో హర్యానాలో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో స్థానిక దేవాలయంలో ప్రాణాలు కాపాడుకున్నారు. అదే రోజు రాత్రి స్థానికంగా మసీదు దగ్దం కావడం అల్లర్ల తీవ్రతను మరింత పెంచింది.
ఇదీ చదవండి: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment