brakes
-
ఇక రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు
సాక్షి, అమరావతి: భారతీయ రైల్వే మరింత ఆధునికతను సంతరించుకుంటోంది. విమానాల తరహాలో రైళ్లలోనూ బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తద్వారా ప్రమాదాలు సంభవిస్తే సమగ్ర విశ్లేషణకు అవకాశం ఏర్పడనుంది. తొలిసారిగా వందే భారత్ రైళ్లలో బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే రైల్వే కోచ్ ఫ్యాక్టరీలకు విధివిధానాలను నిర్దేశించింది. సెప్టెంబర్ నుంచి రూపొందించే రైళ్లలో బ్లాక్ బాక్సులు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతోపాటు రైలు ఇంజిన్లు, బ్రేకులు, ఇతర అంశాల్లో కూడా భద్రతా ప్రమాణాలను మెరుగుపరచనుంది. సీసీఆర్‌సీవీఆర్ పరిజ్ఞానంతో.. కేబిన్ క్రూ రెస్ట్ కంపార్ట్మెంట్ వీడియో రికార్డింగ్ (సీసీఆర్‌సీవీఆర్) సాంకేతిక పరిజ్ఞానంతో బ్లాక్ బాక్సులు తయారు చేస్తారు. విమానాల్లోని బ్లాక్ బాక్సులను కూడా అదే సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందిస్తున్నారు. చిత్తరంజన్‌లోని లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసే వందేభారత్ రైళ్లలో ఈ బ్లాక్ బాక్సులను ప్రవేశపెడతారు. అందుకోసం డిజైన్లు ఖరారు చేశారు. సెప్టెంబర్‌లో తయారు చేసే వందేభారత్ రైళ్లలో వాటిని ప్రవేశపెట్టిన అనంతరం చెన్నైలోని ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీలో పరీక్షించి తుది ఆమోదం తెలుపుతారు. రైలు డ్రైవర్ కేబిన్‌లో అన్ని కదలికలను ఈ బ్లాక్‌బాక్సులు రికార్డు చేసి ఆడియో, వీడియో రూపంలో భద్రపరుస్తాయి. రైలు ఎలాంటి ప్రమాదానికి గురైనా ఆ బ్లాక్ బాక్సులో రికార్డు అయిన సమాచారం భద్రంగా ఉంటుంది. దీంతో ప్రమాద కారణాలను సహేతుకంగా విశ్లేషించి ఇకముందు జరగకుండా తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. -
Nuh violence: బుల్డోజర్ యాక్షన్‌కు హైకోర్టు బ్రేక్..
చండీగఢ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో అల్లర్లు చెలరేగిన తర్వాత అక్కడి ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్‌కు దిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ చర్యలను నిలిపివేయాలని హర్యానా, పంజాబ్ హైకోర్టులు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. దీంతో బుల్డోజర్తో బవనాల కూల్చివేత చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కూల్చివేత చర్యలను నిలిపివేయాలని రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్కట సంబంధిత అధికారులను ఆదేశించారు. హర్యానాలో మతపరమైన ఘర్షణలు చెలరేగిన అనంతరం ఈ వ్యవహారాన్ని కోర్టు సుమోటుగా తీసుకుని విచారణ చేపట్టింది. బుల్డోజర్ యాక్షన్‌లో ఇప్పటివరకు 350 గుడిసెలు, 50 సిమెంట్ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే.. ప్రభుత్వ చర్య రాజకీయంగా విమర్శలకు దారితీసింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తాము అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే నాలుగు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు. విశ్వ హిందూ పరిషత్ రథయాత్రపై కొందరు అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడంతో హర్యానాలో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో స్థానిక దేవాలయంలో ప్రాణాలు కాపాడుకున్నారు. అదే రోజు రాత్రి స్థానికంగా మసీదు దగ్దం కావడం అల్లర్ల తీవ్రతను మరింత పెంచింది. ఇదీ చదవండి: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్.. -
రైళ్లకు రక్షణ ‘కవచం’.. కిలోమీటర్‌కు 50 లక్షల వ్యయం.. తేడా వస్తే బ్రేకులే!
సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలో ఇటీవల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన ఘోర ప్రమాదం రైల్వే చరిత్రలో పెద్ద మచ్చే. కవచ్ రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేశారు. రైళ్ల ప్రమాదాల నివారణకు భారత రైల్వే శాఖ రూపొందించిన ఈ కవచ్ వ్యవస్థ ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉంది. దేశవ్యాప్తంగా కవచ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి 15 ఏళ్లు పడుతుందని రైల్వే శాఖ నివేదిక వెల్లడించింది. స్వర్ణ చతుర్భుజి మార్గంలో 2028 నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపింది. స్వర్ణ చతుర్భుజిలోని చెన్నై – హౌరా మార్గంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందున రాష్ట్రంలో మరో ఐదేళ్లలో (2028నాటికి) కవచ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ‘కవచ్’ సాంకేతిక, మానవ తప్పిదాలతో రెండు రైళ్లు ఒకే సమయంలో ఒకే ట్రాక్ మీదకు వస్తే ఢీకొనకుండా నివారించేందుకు రైల్వే రీసెర్చ్ డిజైన్స్– స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ‘కవచ్’ పేరుతో ఆధునిక రక్షణ వ్యవస్థను రూపొందించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రైల్వే శాఖ రూపొందించిన ఈ వ్యవస్థను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన ఈ వ్యవస్థకు ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ అందించే అత్యుత్తమ స్థాయి సేఫ్టీ ఇంటెగ్రిటీ లెవెల్ –4 (ఎస్ఐఎల్ 40) సర్టిఫికేషన్ కూడా రావడం విశేషం. దేశంలో రైళ్లు ఢీకొన్న ఘటనల్లో 89 శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని వెల్లడైంది. దాంతో శాస్త్రీయంగా అధ్యయనం చేసి ‘యాంటీ కొల్లీషన్ పరికరాలను’ రైల్వే శాఖ రూపొందించింది. దీనిని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పరీక్షించగా, పూర్తి సఫలీకృతమైంది. దీంతో ‘కవచ్’ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో కేవలం 1,450 కిలోమీటర్ల మేరే అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనతో కవచ్ వ్యవస్థను దేశమంతా దశలవారీగా విస్తరించేందుకు రైల్వే శాఖ ప్రణాళికను రూపొందించింది. అందుకోసం హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ అనే సంస్థతో కలసి కవచ్ ప్రాజెక్టును చేపట్టినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఇదీ ప్రణాళిక.. ♦ దేశంలో రైళ్ల రద్దీ అత్యధికంగా ఉండే స్వర్ణ చతుర్భుజి మార్గంలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం కిలోమీటర్‌కు రూ.50 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ♦ స్వర్ణ చతుర్భుజి మార్గంలో మొదటగా ముంబయి–ఢిల్లీ, ఢిల్లీ–హౌరా రూట్లో కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. ఇప్పటికే రైల్వే శాఖ ఈ పనులు ప్రారంభించింది. ముంబయి – ఢిల్లీ 1,384 కి.మీ., ఢిల్లీ–హౌరా 1,454 కి.మీ. కలిపి మొత్తం 2,838 కి.మీ. మేర ఈ పనులను 2024 డిసెంబర్‌కు పూర్తి చేయాలన్నది లక్ష్యం. ♦ రెండో దశ కింద స్వర్ణ చతుర్భుజిలోని ఇతర మార్గాల్లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ మీదుగా చెన్నై–హౌరా మార్గంలో కూడా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. చెన్నై –హౌరా, చెన్నై–బెంగళూరు–ముంబయి మార్గంలో 2024 డిసెంబర్లో పనులు ప్రారంభించి 2028నాటికి పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ♦ ఆంధ్రప్రదేశ్ గుండా చెన్నై–హౌరా మార్గంలో మొత్తం 1,162 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ఈ మార్గంలో కవచ్ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు విజయవాడ, విశాఖపట్నం, కటక్, బాలాసోర్లను ప్రధాన కేంద్రాలుగా గుర్తించారు. ♦ అనంతరం మూడో దశ కింద చెన్నై–ఢిల్లీ మార్గంలో మొత్తం 2,182 కి.మీ. మేర కవచ్ వ్యవస్థను నెలకొల్పుతారు. కవచ్ పనిచేస్తుందిలా.. కవచ్ వ్యవస్థలో భాగంగా రైళ్లలో మైక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), యాంటీ కొల్లీషన్ పరికరాలను ఏర్పాటు చేస్తారు. రైల్వే ట్రాక్‌లను కూడా ఈ పరిజ్ఞానంతో అనుసంధానిస్తారు. ఇస్రో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల నుంచి ఈ పరికరాలు సిగ్నల్స్‌ను స్వీకరిస్తాయి. ఒకే ట్రాక్ మీదకు రెండు రైళ్లు ఒకేసారి పొరపాటున వస్తే మోడెమ్ సహాయంతో ఆటోమేటిగ్గా ఆ రెండు రైళ్లకు పరస్పరం సమాచారం చేరుతుంది. ఒక రైలు ప్రయాణిస్తున్న మార్గంలోనే మరో రైలు కూడా ఎదురుగా వస్తుంటే... నిర్ణీత దూరంలో ఉండగానే ఈ పరికరాల ద్వారా గుర్తించొచ్చు. దాంతో వెంటనే రైలులో ఆటోమేటిక్ బ్రేకులు పడి రైలు నిలిచిపోతుంది. ఈ పరికరాలు మానవ తప్పిదాలను కూడా గుర్తించి నివారించేందుకు దోహదపడతాయి. దాంతో రైళ్లు పరస్పరం ఢీకొనకుండా పూర్తిగా నివారించడం సాధ్యపడుతుంది. -
రైల్ షేర్ల పరుగు కొనసాగేనా?
ఏడాది కాలంగా రైల్వే రంగ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. ఈ బాటలో అత్యధిక శాతం షేర్లు గత రెండు నెలల్లో 52 వారాల గరిష్టాలకు చేరాయి. మరికొన్ని స్టాక్స్ 2022 జనవరిలో నమోదైన గరిష్టాల నుంచి కొంతమేర వెనకడుగు వేసినప్పటికీ పటిష్టంగా ట్రేడవుతున్నాయి. ఇందుకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సార్వత్రిక బడ్జెట్‌పై అంచనాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. రైల్వే స్టాక్స్‌లో కొనసాగుతున్న బుల్ రన్‌కు కొద్ది రోజుల్లో బ్రేకులు పడవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఏడాది కాలంగా పలు కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతుండటంవల్ల లాభాల స్వీకరణకు చాన్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై సానుకూల అంచనాలు రైల్వే రంగ కంపెనీలకు జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. బడ్జెట్ ప్రకటనకు ఇక 30–40 రోజులు మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో రైల్వే కౌంటర్లలో యాక్టివిటీ తిరిగి ఊపందుకోనున్నట్లు పేర్కొన్నారు. అయితే నిజానికి రైల్ షేర్లలో సంస్థాగత ఇ న్వెస్టర్ల పెట్టుబడులు తక్కువగా ఉండటంతో ర్యా లీలో నిలకడ లోపించవచ్చని అభిప్రాయపడ్డారు. అధిక ధరల వద్ద ర్యాలీ కొనసాగేందుకు సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి కీలకమని తెలియజేశారు. వెరసి 2023–24 బడ్జెట్ వెలువడిన తదుపరి రైల్ షేర్లలో దిద్దుబాటు(కరెక్షన్)కు వీలున్నట్లు పేర్కొంటున్నా రు. లాభాల పరుగు రైల్వే సంబంధ కౌంటర్లలో ఆర్వీఎన్ఎల్, టెక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్, రైట్స్ లిమిటెడ్, ఐఆర్ఎఫ్సీ, టిటాగఢ్ వేగన్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, రైల్‌టెల్ కార్పొరేషన్ ఏడాది కాలంగా ర్యాలీ వచ్చింది. ఈ కౌంటర్లు సుమారు 120–100 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇందుకు కొద్ది నెలలుగా రైల్వేలపై ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలు పెరగడం, షేర్లు అందుబాటు ధరలో లభిస్తుండటం, అధిక డివిడెండ్లు వంటి అంశాలు దోహదపడ్డాయి. చాలా కౌంటర్లు 10 పీఈ స్థాయిలో కదులుతుండటంతో ట్రేడర్లు ఆసక్తి చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు 3–4 శాతం డివిడెండ్ ఈల్డ్ ఆకర్షణను పెంచినట్లు తెలియజేశారు. ఫలితంగా డిఫెన్స్ రంగ స్టాక్స్‌లో ర్యాలీ తదుపరి రైల్వే రంగ కౌంటర్లలోకి ఇన్వెస్టర్ల చూపు మరలినట్లు విశ్లేషించారు. 38 శాతంతో జోష్ గత బడ్జెట్(2022–23)లో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయాల్లో విలువరీత్యా రైల్వే ప్రాజెక్టులకు 38 శాతం కేటాయింపులు చేపట్టడం ర్యాలీకి సహకరించినట్లు నిపుణులు తెలియజేశారు. 2019–20లో 43 శాతం కేటాయింపులను పొందిన రీతిలో రైల్వేకు మళ్లీ ప్రాధాన్యత ఏర్పడటం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నట్లు వివరించారు. ఈసారి రానున్న బడ్జెట్లో రైల్వేలు స్థూలంగా రూ. 1.5–1.8 లక్షల కోట్ల బడ్జెటరీ మద్దతును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్లో ఇది రూ. 1.37 లక్షల కోట్లుగా నమోదైంది. కొత్తగా 300–400 వందే భారత్ రైళ్లకు తెరలేవనున్న అంచనాలతో ఈసారి రికార్డ్ బడ్జెటరీ మద్దతు లభించవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న 20–25 ఏళ్లలో కొత్తగా లక్ష కిలోమీటర్ల ట్రాక్‌లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కొత్త లైన్లకూ కేటాయింపులు పెరగవచ్చని భావిస్తున్నాయి. వెరసి ఈ ప్రణాళికల కారణంగా రైల్వే సరఫరాదారులు, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీలకు భారీ ఆర్డర్లు లభించవచ్చని పేర్కొంటున్నాయి. -
ఆకతాయిలపై అబలల కనికరం
-
తమ్ముళ్ల కీచులాటలు రోడ్డు పనులకు బ్రేకులు
రాజంపేట: అధికార పార్టీ నాయకులకు 14 గ్రామాల వాసులకు రోడ్డు సౌకర్యం కల్పించడం కంటే స్వప్రయోజనమే ఎక్కువైంది. తమ పంతమే ముఖ్యమైంది. ఫలితంగా వేలాది మందికి ఉపయోగపడాల్సిన రోడ్డు పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నారుు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప గత అక్టోబరు 26న ప్రారంభించిన రోడ్డు నిర్మాణం ముందుకు సాగడంలేదు. దాదాపు నాలుగుకోట్ల రూపాయిల విలువ చేసే రోడ్డు పనుల్లో వాటాల విషయం అధికార పార్టీ నేతల్లో విభేదాలకు దారితీసింది. ప్రధానంగా కమిషన్లు తెచ్చిన తంటాతోనే కొత్త.. పాత నాయకుల మధ్య వైషమ్యాలు రేపింది. దీంతో రోడ్డు పనులు ముందుకుసాగినివ్వమని ఓ వర్గం నాయకులు అడ్డుపడుతుండగా.. మరోవర్గం నాయకులు రాజీ ధోరణిలో మంతనాలు సాగిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డికి ఇబ్బందిగా తయూరైంది. ఓవైపు పార్టీలో బాబుతో నేరుగా సంబంధాలున్న నాయకులను సముదాయించలేక.. మరోవైపు తనతో పార్టీలోకి వచ్చిన తన సామాజిక వర్గానికి చెందిన నాయకులకు చెప్పుకోలేక మదనపడుతున్నట్లు తెలిసింది. గత యేడాది నుంచి ప్రజలు ఈ రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. నిర్మాణం మొదలైందనకుంటే కమిషన్ల చిచ్చు ఇలా చేసిందని వాపోతున్నారు. రోడ్డు నిర్మాణం ఇలా.. ఏళ్ల తరబడి 14గ్రామాలకు సరైన రహదారి లేని పరిస్ధితుల్లో ప్రధానమంత్రి సడక్యోజన కింద తాళ్లపాక ముఖద్వారం నుంచి రాయచోటి రోడ్డు వరకు లింక్ కలిపే విధంగా నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ పనులను ఎస్ఎస్ఆర్ నిర్మాణ సంస్ధ చేజిక్కించుకుంది. ఆ సంస్థ అధికారపార్టీకి చెందిన నలుగురికి అప్పగించినట్లు సమాచారం. బోయనపల్లె దళితవాడ, చెంచుకాలనీ, హెచ్.చెర్లోపల్లె, మిట్టపల్లె, దొమ్మరాజుపల్లె, హస్తివారిపల్లె, పెద్దకారంపల్లె, బాహ్మణపల్లె మీదుగా రాయచోటి రహదారికి లింక్ రోడ్డుగా 8 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటి వరకు 20శాతం పనులే అయ్యూరుు. బ్రహ్మణపల్లె వద్ద ఈ రోడు నిర్మాణానికి అభ్యంతరాలు పుట్టుకొచ్చాయి. అధికారపార్టీలో ఓ ప్రజాప్రతినిధికి రూ.18లక్షలు ఇవ్వాలనే విషయమై ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చారుు. రాజీకి కాంట్రాక్టర్లు చేసిన మంతనాలు ఫలించలేదు. కొంతవరకైనా.. నిర్మాణ చేపట్టిన కాంట్రాక్టరు కొంతవరకు అయినా రోడ్డు పూర్తి చేయూలనే యోచనతో ఉన్నట్లు సమాచారం. పెద్ద కారంపల్లె వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత సెటిల్మెంట్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ప్రారంభించిన రోడ్డు నిర్మాణానికి కమిషన్లతో మొదలైన విభేదాలు చివరికి నిర్మాణానికే ఆటంకంగా మారారుు. ఈ రోడ్డు వెంబడి అధికంగా దళితవాడలు ఉండటంతో వారి ద్వారా వివిధ కారణాలు చూపుతూ అడ్డుకునే విధంగా పార్టీలో ఓ వర్గం నేతలు పావులు కదుపుతున్నట్లు తాజా సమాచారం. -
ఇన్నర్ పనులకు బ్రేకులు
అడుగడుగునా అవాంతరాలు 75 శాతం పూర్తయిన ఇన్నర్ రింగ్‌రోడ్డు నిర్మాణం నిదానంగా సాగుతున్న పనులు ఇప్పటికే మూడేళ్లు ఆలస్యం సాక్షి, విజయవాడ : నగరంలో వీజీటీఎం ఉడా చేపట్టిన ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్ట్‌కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా వాహన రాకపోకలను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఉడా ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది. అయితే తరచూ కలుగుతున్న ఆటంకాలను ఉడా పట్టించుకోకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. వెరసి ప్రాజెక్ట్ నత్తనడకన సాగుతోంది. వాస్తవానికి 2012కల్లా పూర్తికావాల్సిన ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 75 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. కనీసం ఇప్పుడు మళ్లీ మొదలుపెడితే కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల కాలవ్యవధిలో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కాకపోతే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రాజెక్ట్ పనులను నాలుగు ఫేజ్‌లుగా విభజించి ఏకకాలంలో మొదలుపెట్టారు. 1, 4 ఫేజ్ పనులు ఇప్పటికే పూర్తికాగా, రెండో ఫేజ్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. ఇక గుణదల వద్ద ఫ్లైవోవర్ గడ్డర్స్ కూలిన నేపథ్యంలో మూడో ఫేజ్ పనులు 11 నెలలుగా నిలిచిపోయాయి. నాలుగు ఫేజ్‌లుగా పని విభజన.. అటు నగరాభివృద్ధి, ఇటు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఉడా 2009లో ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులకు శ్రీకారం చుట్టింది. మిల్క్‌ప్రాజెక్ట్ ఫ్లైవోవర్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు 9.84 కిలోమీటర్ల మేర ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించి, ఆ మేరకు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతితో పని ప్రారంభించారు. త్వరగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో పనులను నాలుగు ఫేజ్‌లుగా విభజించి ఏకకాలంలో మొదలు పెట్టారు. ఇన్నర్ రింగ్‌రోడ్డులో భాగంగా 9.84 కి.మీ. రోడ్డు నిర్మాణం, గుణదల, రామవరప్పాడు ప్రాంతాల్లో రెండు ఫ్లైవోవర్ల నిర్మాణానికి మొత్తం రూ. 74.24 కోట్లతో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం 1, 4 ఫేజ్‌ల్లో కేటాయించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఈ ఫేజ్‌ల్లో ఎక్కువగా రోడ్డ నిర్మాణ పనులు మాత్రమే ఉండడంతో వంద శాతం పూర్తయ్యాయి. 2, 3 ఫేజ్‌ల్లో రోడ్ల నిర్మాణాలతోపాటు రెండు ఫ్లైవోవర్లు ఉండడంతో కొంత నత్తనడకన సాగాయి. రెండో ఫేజ్‌లో పనులు 85 శాతం పూర్తయ్యాయి. రోడ్డు ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. పనులు ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి. నాలుగేళ్లలో పూర్తికావాల్సి ఉన్నా.. వాస్తవానికి 2009లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2012 నాటికి పూర్తికావాల్సి ఉంది. ఈ మేరకు ఉడా అధికారులు ప్రాజెక్ట్‌కు కాలవ్యవధిని నిర్ణయిస్తూ ఒప్పందం కూడా చేసుకున్నారు. అయినా 2012 నాటికి 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు వేగవంతం చేయాలని ఉడా అధికారులు కాంట్రాక్టర్‌కు పదేపదే సూచించడం మినహా సీరియస్‌గా దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో నిర్ణీత గడువు దాటి దాదాపు రెండేళ్లు కావస్తోంది. మొత్తం మీద ప్రాజెక్ 2015 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల కోసం.. తాజాగా మూడో ఫేజ్ పనులు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే మొదలవుతాయి. దీనికోసం ఉడా అధికారులతో పాటు కాంట్రాక్టర్ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. గత డిసెంబర్లో గుణదల సమీపాన నిర్మాణంలో ఉన్న ఫ్లైవోవర్ నాలుగు గడ్డర్లు అకస్మాత్తుగా కూలిపోయాయి. రూ. 23.12 కోట్ల నిర్మాణ వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. తొలి విడతగా రూ.13 కోట్లు కాంట్రాక్టర్‌కు ఉడా చెల్లించింది. గడ్డర్లు కూలిన ఘటనపై చెన్నై ఐఐటీ బృందంతో, ఇర్మా సంస్థతో దర్యాపు చేయించారు. ఆ తర్వాత రాష్ట్ర మున్సిపల్ శాఖ హైపవర్ కమిటీతో ఒక విచారణ, జిల్లా విజిలెన్స్ అధికారులతో మరో విచారణ నిర్వహించారు. అన్ని నివేదికలు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై మున్సిపల్ శాఖ దృష్టి సారించి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాకే మూడో ఫేజ్ పనులు మొదలుపెడతారు. కాగా ప్రభుత్వం మరో వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.