ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక అప్‌డేట్ | Delhi Liquor Scam Case: AAP MP Sanjay Singh Moves High Court | Sakshi
Sakshi News home page

లిక్కర్ స్కాం: అరెస్టుపై హైకోర్టులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ సవాలు

Published Fri, Oct 13 2023 11:55 AM | Last Updated on Fri, Oct 13 2023 12:07 PM

Delhi Liquor Scam Case AAP Sanjay Singh Moves High Court  - Sakshi

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్టును సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు విధించిన రిమాండ్‌ను కూడా ఆయన ఛాలెంజ్ చేయనున్నారు. ఈ వ్యవహారంపై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేయనుంది. 

2020-21 నాటికి చెందిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అక్టోబర్‌ 4న ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో మరికొన్ని నిజాల్ని రాబట్టాల్సి ఉందని దర్యాప్తు సంస్థలు విజ్ఞప్తి చేయడంతో సంజయ్‌ సింగ్‌కు రిమాండ్‌ను ట్రయల్ కోర్టు అక్టోబర్ 13కు పొడిగించింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ అధికారులు సంజయ్‌ సింగ్‌ నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లిక్కర్‌ స్కాంలో సంబంధం ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంజయ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. 

మరోవైపు.. సంజయ్‌ సింగ్‌ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తున్న సందర్భంగా ఆప్‌ ఎంపీ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు నిరసనలు తెలిపారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. లిక్కర్‌ స్కాం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.  

ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌ చేరిన మొదటి విమానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement