ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అవకతవకల కేసులో బీజేపీ సీనియర్ నేత ఒకరు కుట్ర పన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవ్‌పై ఒత్తిడి చేసి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా చేశారని శుక్రవారం ఢిల్లీలో పత్రికాసమావేశంలో సంజయ్ చెప్పారు.
ఇదే కేసులో చాలా వారాలపాటు జ్యుడీíÙయల్ కస్టడీలో ఉండి సంజయ్ రెండు రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలైన సంగతి విదితమే. ‘‘ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని లోక్‌సభ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై బీజేపీ ఒత్తిడి చేసింది. అందుకు ఆయన ఒప్పకోలేదు. దీంతో ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌ను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్‌చేశారు. పలుమార్లు అధికారులు ప్రశ్నించడంతో మాగుంట రాఘవ్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఇలా పెద్ద కుట్రలో భాగమయ్యారు. ఢిల్లీ సీఎంను కటకటాల వెనక్కి పంపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది’ అని సంజయ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment