లిక్కర్ స్కాం: సంజయ్ సింగ్‌కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ | AAP Sanjay Singh Gets Warning For Making Political Speech In Court | Sakshi
Sakshi News home page

AAP Sanjay Singh: లిక్కర్ స్కాంలో సంజయ్ సింగ్‌కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్

Published Sat, Oct 14 2023 1:42 PM | Last Updated on Sat, Oct 14 2023 1:53 PM

AAP Sanjay Singh Gets Warning For Making Political Speech In Court - Sakshi

ఢిల్లీ: కోర్టు హాల్‌లో రాజకీయ ప్రసంగం చేసినందుకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా వాదనలు వినిపించే క్రమంలో వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీల పేర్లు ఎత్తినందుకు సంజయ్‌ సింగ్‌కు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వాదనలు జరుగుతాయని న్యాయమూర్తి తెలిపారు. 

సంబంధం లేని విషయాల గురించి మాట్లాడవద్దని న్యాయమూర్తి సంజయ్ సింగ్‌కు హెచ్చరించారు. గౌతమ్ అదానీపై తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు సంస్థలు పనిచేయడం లేదని సంజయ్ సింగ్ కూడా ఆరోపించారు. ఈడీ దర్యాప్తులో తనను కూడా సంబంధం లేని ప్రశ్నలు అడిగారని సంజయ్ సింగ్ న్యాయస్థానానికి తెలిపారు. 

'నా తల్లి నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నాను. నా భార్యకు ఎందుకు రూ.10,000 ఎందుకు పంపాను. అనవసమైన ప్రశ్నలతో ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారింది. అన్నీ అబద్దాలే. అదానీపై ఫిర్యాదు చేశాను. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు.' అని సంజయ్ సింగ్ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మరో రెండు వారాలు రిమాండ్ పెంచాలని ఈడీ అభ్యర్థన మేరకు.. న్యాయస్థానం అక్టోబర్ 27 వరకు సంజయ్ సింగ్‌ రిమాండ్‌ను పొడిగించింది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో వ్యాపారవేత్త దినేశ్ అరోరా లొంగిపోవడంతో సంజయ్ సింగ్‌పై ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే అరెస్టైన దినేశ్ అరోరా, మనీష్ సిసోడియాకు మధ్య మీటింగ్‌ను సంజయ్ సింగ్‌ ఏర్పాటు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వంలో సంజయ్ సింగ్ ఎక్సైజ్ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఈడీ ఆయన నివాసంపై దాడి చేసి కీలక పత్రాలను కూడా ఇప్పటికే స్వాదీనం చేసుకుంది. 

ఇదీ చదవండి: Operation Ajay News: ఢిల్లీ చేరుకున్న రెండో విమానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement