న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం(ఏప్రిల్ 3) రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే సంజయ్‌సింగ్‌కు ఆప్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఆరు నెలల తర్వాత విడుదలైన తమ నేతపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వీరిని ఉద్దేశించి సంజయ్‌సింగ్ మాట్లాడారు. ‘ఇది మనం వేడుక చేసుకునే టైమ్ కాదు. పోరాడాల్సిన సమయం. మన నేతలు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారంతా జైలు తాళాలు బద్దలు కొట్టుకుని బయటికి వస్తారని నాకు నమ్మకం ఉంది’అని సంజయ్‌సింగ్ అన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే సంజయ్ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌ను కలిశారు.
#WATCH | After spending six months in jail, AAP MP Sanjay Singh walks out of Delhi's Tihar Jail. He was greeted by party leaders and workers on his release. pic.twitter.com/dTybWdb7C4
— ANI (@ANI) April 3, 2024
ఇదీ చదవండి.. సంజయ్ సింగ్ రాక.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు
Comments
Please login to add a commentAdd a comment