సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. దీంతో, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
వివరాల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ సర్కార్‌కు మరో షాక్ తగిలింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. కాగా, ఈడీ అధికారులు బుధవారం ఉదయం నుంచి సంజయ్ సింగ్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లిక్కర్ స్కాంలో సంబంధం ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
AAP MP Sanjay Singh arrested following the ED raid at his residence in connection with the Delhi excise policy case. pic.twitter.com/tvOxDaOg5b
— ANI (@ANI) October 4, 2023
మరోవైపు.. సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తున్న సందర్భంగా ఆప్ ఎంపీ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు నిరసనలు తెలిపారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను విచారించిన విషయం తెలిసిందే. మరోసారి విచారణకు రావాలని కూడా ఇటీవలే నోటీసులు ఇచ్చింది.
#WATCH | Delhi | Supporters of AAP MP Sanjay Singh sit outside his residence and raise slogans.
— ANI (@ANI) October 4, 2023
ED raid is going on at his residence since today morning in connection with the Delhi excise policy case. pic.twitter.com/gGTvE3y2uk
ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. గ్యాస్ ధర తగ్గింపు..
Comments
Please login to add a commentAdd a comment