తమ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై జరిగిన దాడి నిజమేనని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అంగీకరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ స్వాతి మాలివాల్‌పై దాడి చేయడాన్ని ఖండించారు. ఈ దాడిని సీఎం దృష్టికి తీసుకెళ్లామని, తగిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ సంజయ్ సింగ్ వెల్లడించారు.
అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎంపీ స్వాతి మలివాల్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో డ్రాయింగ్ రూమ్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎదురు చూస్తున్న సమయంలో బిభవ్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని సంజయ్ సింగ్ అన్నారు. బిభవ్ కుమార్‌పై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆప్ ఎంపీ ఎంపీ స్వాతి మలివాల్ స్థానాన్ని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన తనపై దాడిచేసినట్లు బిభవ్‌పై స్వాతి మలివాల్ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దాడి వ్యవహారం మరింత చర్చకు దారి తీసింది. మరోవైపు బీజేపీ.. ఆప్‌పై విమర్శలు చేస్తోంది. ఈ తరుణంలో అప్ ఎంపీ సంజయ్ సింగ్ దాడిని ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment