
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్‌కు స్వయాన బావమరిది ఝలక్ ఇచ్చారు. చౌహాన్ బావమరిది సంజయ్‌సింగ్ మసానీ శనివారం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరారు. చౌహాన్ సతీమణి సాధనాసింగ్ సోదరుడైన సంజయ్ సింగ్.. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్‌నాథ్, ప్రచార కమిటీ చైర్మన్ జ్యోతిరాదిత్య సింథియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు.
మధ్యప్రదేశ్‌కు కమల్‌నాథ్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరముందని, 13 ఏళ్ల రాష్ట్రాన్ని పాలించిన శివ్‌రాజ్ అవసరం రాష్ట్రానికి లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీజేపీ వారసత్వ రాజకీయాలను పెంచిపోషిస్తోందని సంజయ్‌సింగ్ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 28న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ శుక్రవారం 177 మంది పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగలడం గమనార్హం.