ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్
తిహార్ జైలు నుంచి విడుదల
న్యూఢిల్లీ: విపక్షాలపై తీవ్ర నిర్బంధ చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచి్చందని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆర్నెల్ల పాటు తిహార్ జైల్లో గడిపిన ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన గురువారం రాత్రి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు వెంట రాగా ఓపెన్ టాప్ కార్లో ర్యాలీగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు.
అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ల నివాసాలకు కూడా వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శిస్తానని చెప్పారు. మోదీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోందంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘మోదీ సర్కారు ఎంతగా వేధించినా ఆప్ బెదరబోదు. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరు. 2 కోట్ల మంది ఢిల్లీవాసుల ప్రయోజనాల పరిరక్షణకు జైలు నుంచే సీఎంగా విధులు నిర్వర్తిస్తారు. ఆయన, సిసోడియా, జైన్ త్వరలోనే విడుదలవుతారు’’ అని అన్నారు. అవినీతి ఆరోపణలపై విపక్ష పాలిత రాష్ట్రాల పోలీసులు మోదీ ఇంటి తలుపు తడితే విచారణకు ఆయన సహకరిస్తారా అని సంజయ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment