
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. హిందూ వాహినికి చెందిన గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి చంపుతామంటూ సంజయ్ సింగ్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు.దీంతో అప్రమత్తమైన ఆయన నార్త్ ఎవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'హిందూ వాహిని' నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్లు సంజయ్‌సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
'7288088088 మొబైల్ నంబర్ నుంచి నాకు తెలియని వ్యక్తి నుంచి కాల్స్ వస్తున్నాయి. సోమవారం కూడా అదు నెంబర్ నుంచి నాకు ఫోన్ రావడంతో నా సహోద్యోగి అజిత్ త్యాగి ఫోన్‌కు మళ్లించాను. మధ్యాహ్నం 3.59 గంటలకు కాల్ తీసుకోగా.. కాల్ చేసిన వ్యక్తి తనను చంపేస్తానంటూ బెదిరించాడు. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తానుగా హిందూ వాహిని నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. కిరోసిన్ పోసి సజీవ దహనం చేస్తానంటూ బెదిరించాడని' ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లైంట్‌ను సంజయ్ సింగ్ తన ట్విటర్‌లో షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment