న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ సింగ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో జైలు పాలైన సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ విచారణ ముగిసే వరకు ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మద్యం సిండికేట్‌కు సంబంధించి లంచంగా తీసుకున్నారని ఆరోపిస్తున్న ఈ కేసులో సంజయ్ సింగ్ వద్ద ఒక్క పైసా కూడా లభించనప్పుడు.. 6 నెలలుగా జైలులో ఎలా ఉంచుతారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రశ్నించింది. ఆప్ ఎంపీపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని తెలిపింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా సంజయ్ సింగ్ పాల్గొనవచ్చని పేర్కొంది.
కాగా లిక్కర్ కేసులో సంజయ్ సింగ్‌ను ఆప్ గతేడాది అక్టోబర్‌లో అరెస్ట్ చేసింది. గత ఆరు నెలలుగా సంజయ్‌సింగ్ తీహార్ జైలులోనే ఉన్నారు. ఈ క్రమంలో తన రిమాండ్‌ను వ్యతిరేకిస్తూ సంజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది సుప్రీంకోర్టు. విచారణ సందర్భంగా సంజయ్ సింగ్‌కు బెయిల్ ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ పేర్కొంది.
అనంతరం సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్త, జస్టిస్ పిబి.వరాలే ధర్మసనం బెయిల్ ఉత్తర్వులను జారీ చేసింది.
చదవండి: ‘చైనా తెలివి తక్కువ ప్రయత్నం’.. పేర్ల మార్పుపై భారత్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment