సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో తదుపరి విచారణ సెప్టెంబర్ ఐదో తేదీన జరుగనుంది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖలు చేయలేదు. ఇక, విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. ఉద్దేశ్యపూర్వకంగానే సీబీఐ ఆలస్యం చేస్తోందన్నారు.
ఈ క్రమంలో సీబీఐ కౌంటర్ దాఖలుకు గడువు ఇస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మసనం తదుపరి విచారణను సెప్టెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment