జైల్లో కేజ్రీవాల్ ను కలిసిన భార్య సునీత | Arvind Kejriwal meets wife, AAP leaders in Tihar Jail | Sakshi
Sakshi News home page

జైల్లో కేజ్రీవాల్ ను కలిసిన భార్య సునీత

Published Thu, May 22 2014 3:20 PM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

కేజ్రీవాల్ భార్య సునీత

కేజ్రీవాల్ భార్య సునీత

న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈ ఉదయం ఆయన భార్య సునీత కలిశారు. ఆమె తన భర్త కోసం బట్టలు, మందులు తీసుకొచ్చారు. ఆప్ నాయకులు సంజయ్ సింగ్, అశతోష్ కూడా కేజ్రీవాల్తో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. జైలు గార్డులు, జైలు సిబ్బందితోనూ కేజ్రీవాల్ మాట్లాడారు.

అవినీతికి వ్యతిరేకంగా సామాన్యుడిలా పోరాడుతున్నందునే తాను జైలుకు రావాల్సివచ్చిందని కేజ్రీవాల్ అన్నట్టు జైలు సిబ్బంది తెలిపారు. రాత్రంతా జైల్లో ఆయన బాగానే నిద్రపోయారని చెప్పారు. తెల్లవారుజామునే లేచి జైలు ప్రాంగణంలోనే నడక సాగించారని తెలిపారు. తర్వాత తన సెల్ కు తిరిగి వచ్చి అల్పాహారం తీసుకున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement