
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. అరెస్టైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితులకు కూడా సమన్లు జారీ చేసింది. సంజయ్ సింగ్‌కు అతి సన్నిహితులైన వివేక్ త్యాగి, సర్వేశ్ మిశ్రాలను శుక్రవారం ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
సంజయ్ సింగ్‌పై దర్యాప్తులో భాగంగా ఆప్ అధికార ప్రతినిధి సర్వేశ్ మిశ్రా పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంజయ్ సింగ్ తరుపున సర్వేశ్ మిశ్రా కోటి రూపాయలు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్‌తో పాటు సర్వేశ్ మిశ్రా, వివేక్ త్యాగిలను కూడా ఈడీ ప్రశ్నించనుంది.
మద్యం కుంభకోణం కేసులో సంజయ్ సింగ్ అక్టోబర్ 10 వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన వారిలో ఈయన మూడో వ్యక్తి. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లు అరెస్టయ్యారు. బుధవారం 10 గంటలపాటు ప్రశ్నించిన తర్వాత సంజయ్ సింగ్‌ను అరెస్టు చేశారు. అంతేకాకుండా ఆయన ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు కూడా చేసింది. నిందితుడు దినేశ్ అరోరా నుంచి సంజయ్ సింగ్ రూ.2 కోట్లు అందుకున్నాడనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment