AP CID Officers Notices To TDP Central Office Over Chaitanya Ratham - Sakshi
Sakshi News home page

‘చైతన్య రథం ఎడిటర్‌ ఎవరు?’ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు

Published Tue, Apr 11 2023 3:38 PM | Last Updated on Tue, Apr 11 2023 4:09 PM

AP CID Officers Notices TDP Central Office Over Chaitanya Ratham - Sakshi

సాక్షి, విజయవాడ: అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు వెళ్లారు. అంతేకాదు టీడీపీ జనరల్‌ సెక్రటరీ పేరిట సీఐడీ మంగళవారం నోటీసులు కూడా అందించారు. 

టీడీపీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న.. వార్తా కథనాలపై సీఐడీ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆ పత్రిక ఎడిటర్‌, నిర్వహణ ఎవరంటూ సీఐడీ ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది.  ఈ మేరకు అక్కడి లాయర్‌ చేతికి నోటీసులు అందించారు సీఐడీ అధికారులు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. 

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌పై చైతన్య రథం ప్రతిక తప్పుడు కథనాలు ప్రచురించింది. ఎన్నికల కమిషన్‌కి బుగ్గన సమర్పించిన అఫిడవిట్‌లో స్థిర, చర ఆస్తులపైనా తప్పుడు రాతలు రాసింది. దీంతో ఆయన పత్రికపై ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది సీఐడీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement