కలెక్టరేట్, న్యూస్‌లైన్: ట్రాన్స్‌కో ఎస్‌ఈగా యు.బాలస్వామి శని వారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయం నుంచి జిల్లాకు వచ్చారు. కరుణాకర్‌ను ఆయన స్థానానికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్‌ఈ మాట్లాడుతూ... జిల్లాలో వ్యవసాయానికి ఏడు గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటానని చెప్పారు.
జిల్లాలో 12ఏళ్లు పనిచేసిన అనుభవం..
ఎస్‌ఈ బాలస్వామిది ఖమ్మం జిల్లా కామపల్లి మండలం రాయగూడెం గ్రామం. ఆయన బీఈ ఎలక్ట్రికల్, ఎంబీఏ చదివారు. జిల్లాలో 12 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. కోదాడలో ఏడీ ఆపరేషన్‌గా, భువనగిరిలో డీఈ ఆపరేషన్‌గా, నల్లగొండలో ఎంఆర్‌టీగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఏడీగా వెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో డీఈ విజిలెన్స్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అక్కడే స్కాడా డీఈగా పనిచేశారు. కార్పొరేట్ కార్యాలయంలోని కమర్షియల్ ఎస్‌ఈగా పనిచేస్తూ జిల్లాకు ఎస్‌ఈగా బదిలీపై వచ్చారు.
బాలస్వామి బాధ్యతల స్వీకరణ
Published Sun, Feb 2 2014 4:28 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement