బాబు అద్దె ఇంటికి రూ.అరకోటి | chandra babu cost of the house lakh to Rs .81.10 | Sakshi
Sakshi News home page

బాబు అద్దె ఇంటికి రూ.అరకోటి

Published Fri, May 29 2015 1:12 AM | Last Updated on Wed, Sep 5 2018 1:47 PM

chandra babu cost of the house lakh to Rs .81.10

ఇప్పటికే అదే ఇంటికి రూ.81.10 లక్షలు ఖర్చు
 
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 24లోని అద్దె ఇంటికి రూ.అరకోటికి పైగా కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుదీకరణ పనులకోసం రూ.35 లక్షలు, అద్దె ఇంటిలో ఉన్న క్యాంపు కార్యాలయంలో పనులకోసం రూ.20.85 లక్షలు కేటాయించారు.

జూబ్లీహిల్స్ అద్దె ఇంటికోసం మొత్తం రూ.55.85 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ ఆదేశాలిచ్చారు. ఇంతకుముందే ఈ ఇంటికి రూ.81.10 లక్షలు ఖర్చు చేశారు. సీఎం జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 24లోని అద్దె ఇంటికి గత ఏప్రిల్‌లో మారారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement