మంత్రి పత్తిపాటి నివాసం ముట్టడి | Sharecroppers obsession of pattipati residence | Sakshi
Sakshi News home page

మంత్రి పత్తిపాటి నివాసం ముట్టడి

Published Sat, May 21 2016 1:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

Sharecroppers obsession of pattipati residence

చిలకలూరిపేట: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని మంత్రి పత్తిపాటి పుల్లారావు నివాసాన్ని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కౌలు రైతులు శనివారం ముట్టడించారు. వందలాదిగా వచ్చిన రైతులు మంత్రి నివాసం ముందు బైఠాయించారు. కౌలు రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని కోరారు. మంత్రి తన నివాసంలో లేకపోవడంతో విషయం తెలుసుకున్న ఆయన ఆందోళన చేస్తున్న రైతులతో ఫోన్లో మాట్లాడారు. సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement