
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈనెల 4న (శుక్రవారం) సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇకపై కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండనున్నారు. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది కేజ్రీవాల్‌కు వివిధ పనులు నిర్వహణకు ఎంతో అనువుగా ఉండనున్నదని తెలుస్తోంది.
అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయనున్నారని, ఆయన కొత్త ఇంటి కోసం వెదుకులాట జరుగుతోందని పార్టీ ఇటీవలే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉండే ఇంటికోసం వెదికారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున కేజ్రీవాల్ తన సమయాన్ని, వనరులను ఉపయోగించుకునేందుకు అనువుగా ఉండే ఇంటి కోసం వెదికారు.
మాజీ సీఎం కేజ్రీవాల్‌కు ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్మికులు, వివిధ సామాజిక, రాజకీయ ప్రముఖులు వసతి కల్పించేందుకు ముందుకువచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. డిఫెన్స్ కాలనీ, పితంపురా, జోర్‌బాగ్, చాణక్యపురి, గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, హౌస్ ఖాస్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో అరవింద్ కేజ్రీవాల్‌కు వసతి కల్పిస్తామంటూ అనేక ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలను కలిసే సౌలభ్యం ఉండే అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారు.
కేజ్రీవాల్ జాతీయ పార్టీ అధినేత పదవిలో ఉన్నందున ఆయనకు అధికారిక నివాసం కల్పించాలని పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేజ్రీవాల్ తన భార్య, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని కౌశాంబిలో ఉన్నారు. 2013లో తొలిసారిగా ఢిల్లీ సీఎం అయ్యాక తిలక్ లేన్‌లోని బంగ్లాలో నివాసమున్నారు. 2015లో రెండోసారి ఢిల్లీ సీఎం అయిన తర్వాత నుంచి ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో నివాసం ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు
Comments
Please login to add a commentAdd a comment