
ఉత్తరాఖాండ్‌లోని జ్యోతిర్‌మఠ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి..

బాలీవుడ్ హీరోయిన్ పరిణతి చోప్రా ఇంటికి వెళ్లారు.

దీంతో పరిణతితో పాటు ఆమె భర్త, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మురిసిపోయారు.

ఆయనకు పాదపూజ చేసి స్వాగతం పలికారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను పరిణతి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతిగారు మా ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

అది నిజంగా మాకెంతో గర్వకారణం. ఆయన మా ఇంటికి వస్తారని అసలు ఊహించలేదు.

ఆయనలోని తేజస్సు.. సనాతన ధర్మానికి మమ్మల్ని మరింత దగ్గర చేసింది. స్వామి ఆశీర్వాదాలు అందినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాం' అని చెప్పుకొచ్చింది.








