shankaracharya
-
దురలవాట్లను దూరం చేసే కొల్లూరు మూకాంబికాలయం
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం. క్షేత్రపురాణం: జగద్గురు ఆదిశంకరులు కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి, అందుకు ఒక షరతు విధిస్తుంది. అదేమంటే, తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తాడు శంకరులు. ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు. కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో, వెనక్కు తిరిగి చూస్తాడు శంకరులు. ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది. తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. దీంతో ఆదిశంకరులు శ్రీ చక్రంతోపాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. నాటినుంచి అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి. మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైనా హారతి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అమ్మవారికి ప్రదోష కాలంలో ఇచ్చే హారతి ప్రత్యేకమైనది.సౌపర్ణికానది: ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుటజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి. ఈ నది ఒడ్డున సుపర్ణుడు అంటే గరుత్మంతుడు తన తల్లి దుఃఖాన్ని పోగొట్టమని కోరుతూ అమ్మవారిని గురించి ఘోర తపస్సు చేసి వరం పొందాడట. ఆ నాటినుంచి ఈ నదికి సౌపర్ణికానది అని పేరు వచ్చింది. ఈ నదిలో అనేక వనమూలికలు ఉంటాయని, అందువల్ల ఈ నదిలో స్నానం చేస్తే చర్మరోగాలు నయం అవుతాయని చెబుతారు. ఇతర సందర్శనీయ స్థలాలు ఆలయ బయటి ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి తదితర దేవతల సన్నిధులున్నాయి. కొల్లూరు చుట్టుపక్కల మంగుళూరు మంగళాదేవి, ఉడిపి కృష్ణుడు, కుందాపూర్, భత్కల్, షిమోగా, ధర్మస్థల, శృంగేరీ శారదాపీఠాలు సందర్శనీయ స్థలాలు. ఇక్కడ గల కుటజాద్రి పర్వత శ్రేణి అందమైన అటవీ సంపదతో ఆకట్టుకుంటుంది. ఈ పర్వతశ్రేణి ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎలా వెళ్లాలి? మంగుళూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కొల్లూరుకు వెళుతుంటుంది. ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. మంగుళూరుకు నేరుగా అన్ని ప్రధాన నగరాలనుంచి బస్సులు, రైళ్లు ఉన్నాయి. మంగుళూరులో విమానాశ్రయం కూడా ఉంది. (చదవండి: లోకహితం కోసం ప్రాణాలర్పించిన అసురుడు..!) -
ఆరెస్సెస్ చీఫ్‌పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య ఆగ్రహం
రాష్ట్రీయ స్వయంసేవక్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మందిర్-మసీద్ వివాదాలను ఉద్దేశించి భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భగవత్‌కు హిందువుల మనోభావాలపై పట్టింపు లేనట్లు ఉందని అన్నారాయన. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..‘‘అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని మోహన్ భగవత్ అన్నారు. కానీ, సాధారణ హిందువులు అలా ఏనాడూ అనుకోరు. దేశంలో ఎన్నో ఆలయాలను కూల్చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఆయనకు(మోహన్ భగవత్‌కు) హిందువుల నొప్పేంటో పట్టన్నట్లు ఉంది. హిందువుల ప్రస్తుత దుస్థితి ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన మాటలతో ఆ విషయం స్పష్టమైంది’’ అని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు.భగవత్ ఏమన్నారంటే..ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పుణే(Pune)లో జరిగిన ‘ఇండియా ది విశ్వగురు’ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇటీవల కాలంలో మందిర్-మసీద్ వివాదాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరం. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రతిరోజూ కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించమంటారు?.. .. ఇది కొనసాగకూడదు. కలిసిమెలిసి ఎలా ఉంటామో భారత్ చూపించాలి. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. దీనిలో ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను వారే ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతిఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు..? ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే. ఎవరి ఇష్టమైన భగవంతుడి ఆరాధనను వారు పాటించడమే ఈ దేశ ఆచారం. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం అవసరం. అలాగే.. కలుపుగోలు సమాజాన్ని మనకు మంచింది. మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. మేం హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్(Rama Krishna Mission) లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకొంటాం. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నాం. దీనిని మనం ప్రపంచానికి అందించాలనుకొంటే.. ఓ ఉదాహరణగా నిలవాలి’’ అని అన్నారు.👉ఇదిలా ఉంటే.. భగవత్ వ్యాఖ్యలపై జగద్గురు స్వామి రామభద్రచార్య సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవత్ తమ అనుచరుడి కాదని మండిపడ్డారు. ఆయన ఎంతోమంది భస్వాసురులను సృష్టించారని.. వాళ్లే ఆరెస్సెస్ నెత్తిన చెయ్యి పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 👉మరోవైపు.. రాజకీయంగానూ ఈ వ్యాఖ్యలపై చర్చ నడిచింది. సామరస్యం పాటించాలని భగవత్ బీజేపీనే కోరుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. యోగి ఆదిత్యానాథ్‌కు ఆయన(మోహన్ భగవత్) గనుక సూచిస్తే.. ఏ సర్వేలు. వివాదాలు ఉండవని అఖిలేష్ అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందిస్తూ.. మోహన్ భగవత్‌ది ద్వంద్వ ధోరణి అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ఈ పుణ్య క్షేత్రాల నగరం గురించి తెలుసా? -
ఆయన మా ఇంటికి వస్తారనుకోలేదు.. సంతోషంలో హీరోయిన్ (ఫోటోలు)
-
బంగ్లాదేశ్ సంక్షోభంపై అవిముక్తేశ్వరానంద ఏమన్నారంటే..
బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె ఢాకా వదిలి ఇండియా వచ్చారు. ఇక్కడి నుంచి షేక్ హసీనా ఇప్పుడు లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ సంక్షోభంపై ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బంగ్లాదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆ దేశంలో సైనిక పాలన నడుస్తోంది. పౌరులను రక్షించే బాధ్యతను సైన్యం కచ్చితంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో దాదాపు 10 శాతం మంది హిందువులు నివసిస్తున్నారు. వారి భద్రత ఎంతో ముఖ్యం. హిందువుల భద్రత కోసం బంగ్లాదేశ్ ఆర్మీ పాటుపడాలి’ అని కోరారు.కాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో సహా అనేక ఇతర నగరాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో వందల సంఖ్యలో జనం మృతిచెందారు. -
‘నేతలు గోల్గప్పాలు అమ్ముకోవాలా?’: కంగనా
బాలీవుడ్ నటి కంగన రాజకీయాల్లోకి ప్రవేశించాక తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆమె జ్యోతిర్మఠం(ఉత్తరాఖండ్)నకు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇటీవల ముంబైలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని ఆరోపించారు. సనాతన ధర్మంలో ద్రోహం పెద్ద పాపమని పేర్కొన్నారు. అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యల నేపధ్యంలో కొందరు ఆయనను విమర్శిస్తుండగా, మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.ఈ ఉదంతంపై బాలీవుడ్ క్వీన్, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ కూడా స్పందించారు. ఎంపీ కంగనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మద్దతు పలుకుతూ, అవిముక్తేశ్వరానందపై విమర్శలు చేశారు. శంకరాచార్య తన పదజాలంతో మతపరమైన విద్యను దుర్వినియోగం చేశారని కంగనా ఆరోపించారు.కంగనా తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో..‘ రాజకీయాల్లో పొత్తు, పార్టీ విభజన అనేవి చాలా సాధారణమైన, రాజ్యాంగబద్ధమైన విషయాలని, 1907లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని, 1971లోనూ ఇలానే జరిగిందని, నేతలు రాజకీయాలు చేయకపోతే గోల్గప్పాలు (పానీపూరీలు) అమ్ముకోవాలా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను దేశద్రోహి అని వ్యాఖ్యానించిన శంకరాచార్య హిందూ ధర్మం గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు. राजनीति में गठबंधन , संधि और एक पार्टी का विभाजन होना बहुत सामान्य और संवैधानिक बात है, कांग्रेस पार्टी का विभाजन 1907 में और फिर 1971 में हुआ, अगर राजनीति में राजनीतज्ञ राजनीति नहीं करेगा तो क्या गोलगप्पे बेचेगा? शंकराचार्य जी ने उनकी शब्दावली और अपने प्रभाव और धार्मिक शिक्षा… https://t.co/UV2KuLwVUz— Kangana Ranaut (@KanganaTeam) July 17, 2024 -
ధర్మోద్ధారకులు శంకరాచార్యులు
ధర్మానికి గ్లాని ఏర్పడినపుడు శిష్టరక్షణకై దుష్టశిక్షణకై తాను అవతారాన్ని ధరిస్తానని భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పాడు. ‘సంభవామి యుగే యుగే’ ధర్మగ్లాని అంటే జనులకు స్వధర్మాచరణ పట్ల శ్రద్ధా భక్తులు లోపించడం ధర్మాచరణ కించిత్తు కూడా ఆచరణ చేయకుండా ఉండటం. అలానే వేదాలలో... శాస్త్రాలలో చెప్పినదానికి విరుద్ధంగా ధర్మాన్ని ప్రబోధించి జనులను పక్కదోవ పట్టించి అవైదిక ధర్మ ప్రాబల్యం పెరగడం. అలాంటి సమయంలో పునః ధర్మప్రతిష్ట చేయడానికి భగవదవతారం జరుగుతుంది. కలియుగానికి వచ్చేసరికి జనులలోని రాక్షస ప్రవృత్తిని తీసివేయాలి. అంటే వారిని అధర్మమార్గం నుండి ధర్మమార్గం వైపు బుద్ధిని ప్రచోదించేలా చేయాలని, జ్ఞానభిక్ష పెట్టాలనీ సాక్షాత్తు పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో ఆర్యాంబా శివగురువులనే పుణ్యదంపతులకు కేరళ రాష్ట్రం కాలడీ క్షేత్రంలో పూర్ణానదీ తీరాన వైశాఖ శుద్ధ పంచమి శుభతిథిన తేజోమూర్తిౖయెన శంకరాచార్యుల వారు జన్మించారు. శంకరులు బాల్యంలోనే అత్యంత ప్రజ్ఞాశాలిగా ఉండేవారు. ఆయన ఐదవ సంవత్సరంలో ఉపనయనాన్ని చేసుకొని అతి తక్కువ సమయంలో ఏ మానవ మాత్రునికి కూడా సాధ్యం కాని ‘అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశీ సర్వశాస్త్రవిత్’ ఎనిమిదవ సంవత్సరంలో చతుర్వేదాలు 12 సంవత్సరాల వయస్సులోపు సర్వశాస్త్రాలను అధ్యయనం చేశారు. వేదాధ్యయన సమయంలో భిక్షాటనకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా ఆమె ఒక ఉసిరికాయను ఇచ్చింది. ఆమె దారిద్య్ర పరిస్థితిని చూసి చలించిపోయిన శంకరులు ‘కనకధారా స్తోత్రం’ ఆశువుగా స్తుతించారు. దానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపించింది. శంకరుల సన్యాస ఆశ్రమ స్వీకారం కూడా చాలా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో తల్లిని ఆనుమతి కోరారు. సన్యాసం స్వీకరిస్తే తన ఒంటరి అవుతానన్న కారణంతో తల్లి అందుకు నిరాకరించింది. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. తనను సన్యసించడానికి అనుమతిస్తే మొసలి వదిలేస్తుందని చెప్పారు. ఈ సంసారబంధాలు తనను మొసలిలా పట్టుకున్నాయని ఆ బంధాల నుండి తనను తప్పించమని కోరారు. దీనినే ఆతుర సన్యాసం అంటారు, సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా మొసలి శంకరులను విడిచి వెళ్లిపోయింది. తరువాత గురువుకోసం అన్వేషిస్తూ నర్మదా నదీతీరంలో ఉన్న గోవింద భగవత్పాదులను దర్శించి ఆయననే తన గురువుగా తెలుసుకొన్నారు. ‘షోడశే కృతవాన్ భాష్యం’ తరువాత మహోత్కృష్టమైన బ్రహ్మసూత్రాది గ్రంథాలకు భాష్యాన్ని రచించారు. మహా మహా పండితులకు కూడా మళ్లీ, మళ్లీ చదివితే కాని అర్థం కాని ఎన్నో గ్రంథాలు రచించారు. కనీసం శబ్దజ్ఞానం కూడా లేనటువంటి సామాన్యవ్యక్తికి కూడా వేదాంతాది విషయాలను ‘భజగోవిందం’ వంటి స్తోత్రాల ద్వారా ప్రబోధించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించాలన్నా సమైక్యవాదాన్ని స్థాపించాలన్నా ఆదిశంకరుల సిద్ధాంతం తప్ప మరొకటి లేదని నిరూపించినవే ఆదిశంకరుల రచనలు. ఆయన కాలినడకన దేశాద్యంతం పర్యటించి అవైదికమైన 72 మతాలను సప్రమాణంగా ఖండిస్తూ వేదప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆదిశంకరులు వైదిక మతోద్ధారకులు. దాని పేరే అద్వైత సిద్ధాంతం. ‘‘వేదో నిత్యమధీయతాం’’ తదుదితం కర్మస్వనుష్టీయతాం అనే అనేకమైన ఉపదేశాలను జనహితానికి ఆయన ప్రబోధించిన జ్ఞానమార్గాన్ని సూర్యచంద్రులు ఉన్నంతవరకు ప్రసరింప చేయాలనే ఉద్దేశ్యంతో తూర్పున పూరీలో గోవర్థన పీఠం, దక్షిణాన శృంగేరీలో శ్రీ శారదా పీఠం, పశ్చిమాన ద్వారకలో శారదా పీఠం, ఉత్తరాన బదరిలో జ్యోతిష్పీఠాలను స్థాపించారు. ఈ పీఠాలు, పీఠాధిపతుల ద్వారా ఎల్లప్పుడూ జనులకు ధర్మ ప్రబోధం జరిగి అందరూ వేదోక్తకర్మలను ఆచరించి జ్ఞానమార్గాన్ని పొంది శ్రేయోవంతులు అవాలని లోకోపకారం కోసం మహత్తరమైన కార్యకలాపాలను శంకరాచార్యుల వారు చేశారు. అలాంటి మహోన్నతమైన శ్రీ శంకరాచార్యుల వారిని అయన జయంతి సందర్భంగా స్మరించడం కన్నా ప్రతి సనాతన ధర్మ అనుయూయులకు పుణ్యమేముంది? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరుల వారిని ఈరోజు ఆరాధించాలి. ఆరాధించడం, పూజించడం, స్మరించడం ఎంతముఖ్యమో ఆయన ప్రతిపాదించిన ధర్మాన్ని పాటించడం అంతే ముఖ్యం. ఎల్లప్పుడూ స్వధర్మాన్ని ఆచరిస్తూ, జ్ఞానోపార్జన చేస్తూ ఈ జీవనాన్ని సఫలీకృతం చేసుకుందాం. (నేడు శంకర జయంతి) వ్యాసోఝల గోపీకృష్ణశర్మ వేద పండితులు, శృంగేరీ పీఠం -
నీ వెనుక రావడానికి ఆయనెప్పుడూ సిద్ధమే!
‘నీవు వటువువా! గృహస్థువా! సన్యాసివా! యతివా! ఎవరికి కావాలి ? నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టావా, లేదా! అలా పెడితే నీ వెంట పరిగెతి రావడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు.’’ అంటారు శంకరాచార్యుల వారు శివానంద లహరిలో. అన్నమాచార్యుల వారు అదే భావనతో కీర్తన చేస్తూ..‘‘కుమ్మర దాసుడైన కురువరతినంబి రమ్మన్న చోటికి వచ్చి అంతగా కోర్కె తీర్చినవాడివే’’ అంటూ తరువాత చరణంలో ‘‘దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు’’ అంటారు. ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరు ?పూర్వకాలంలో సుధర్మడునే రాజు ఉండేవాడు. ఆయన కపిలతీర్థం దగ్గరికి వచ్చారు. అక్కడ స్నానాలు చేస్తున్న సమయంలో పాతాళ లోకాన్ని పరిపాలించే ధనంజయుడనే నాగలోకపు ప్రభువు కుమార్తె అక్కడ జలకాలాడుతూ కనపడింది. ఆమె అంగీకారంతో ఆయన ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వారు కొంతకాలం అక్కడ ఉన్న దొండపొదలలో విహరించారు. ఆమె గర్భందాల్చి పుట్టింటికి వెడుతుంటే..‘‘నీకు కుమారుడు కలిగి పెద్దయిన తరువాత వాడిని నా దగ్గరికి పంపేటప్పుడు నేను గుర్తుపట్టడానికి వీలుగా దొండ తీగలను నడుముకు చుట్టుకుని ఈ రాజముద్రికను వేలికి పెట్టుకుని రమ్మనమను. అలా వస్తే నేను సులభంగా గుర్తుపడతాను’’ అని ఉంగరం ఇచ్చి ఆమెకు అభయం ఇస్తాడు. ఆమె తరువాత అలాగే సుధర్ముడి వద్దకు పంపింది. నడుముకి దొండతీగలు చుట్టుకుని వచ్చాడు కనుక ఆయనకు తొండమాన్ అని పేరొచ్చింది. (తొండమాన్ తవ్వించిన చెరువు ఇప్పటికీ ఉంది. ఈయన వేంకటేశ్వరుడి మామగారయిన ఆకాశరాజుకు సోదరుడు. ఇద్దరికీ సమానమైన రాజ్యభాగం ఇచ్చారు). తొండమాన్ జీవితంలో ఒక పొరబాటు చేసాడు. ఒకరోజు కూర్ముడు అనే బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చి‘మా తండ్రిగారి అస్థికలు గంగలో నిమజ్జనం చేయడానికి కాలినడకన కాశీకి వెడుతున్నాను. నాభార్య గర్భిణి, కొడుకు ఐదేళ్ళవాడు, ఎక్కువ దూరం నడవలేడు. నేను తిరిగొచ్చేదాకా వారి ఆలనాపాలనా మీరు చూడాలి’ అని కోరగా సమ్మతించిన తొండమాన్ వారిని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఒక భవంతిలో ఉంచి తదనంతరకాలంలో మర్చిపోయాడు. కొంతకాలానికి అక్కడ వారికి ఆహార పదార్థాలు అయిపోయాయి. మరికొంతకాలానికి కూర్ముడు తిరిగొచ్చి తన భార్యబిడ్డలని అప్పగించమని కోరతాడు. అప్పడు వారి విషయం గుర్తొచ్చి మొదట భయపడినా ‘‘వారు స్వామి దర్శనానికి వేంకటాచలం వెళ్ళారు. వచ్చేస్తారు. అప్పటిదాకా సత్రంలో ఉండండి భోజన సంభారాలు ఏర్పాటు చేయిస్తాను’ అని చెప్పి పంపుతాడు. తొండమాన్ వెంటనే తన కుమారుడిని పంపి వాళ్ళకోసం వాకబు చేయించాడు. వెళ్ళినవాడు తిరిగొచ్చి ‘‘ఆహారం లేక వారు మరణించారు. అక్కడ అస్థిపంజరాలు పడి ఉన్నాయి’’ అన్నాడు. భయపడిపోయిన తొండమాన్ ఆనంద నిలయానికి పరుగున వెళ్ళి స్వామి పాదాలను ఆశ్రయించాడు. తన భక్తుడివై, రాజువై ఉండి మాట ఇచ్చి తప్పి ఇంతటి ఘాతుకానికి కారణమయ్యావు. అయినా రక్షిస్తా. అస్థి తీర్థంలో(ఇప్పటికీ ఉంది) నేను మెడలోతు నీళ్ళలో మునిగి ఉంటా. వెంటనే వెళ్ళి అస్తికలు తెచ్చి ఒడ్డున పెట్టి ఆ తీర్థం నీళ్ళతో ప్రోక్షణ చెయ్యి.’’ అని ఆదేశించాడు. ఆ తరువాత వాళ్ళు బతికారు.అప్పటివరకు భక్తులతో మాట్లాడుతుండే స్వామివారు ‘ఈనాటినుంచి నేనిక మాట్లాడను. నేనేదయినా చెప్పవలసి వస్తే అర్చకులమీద ఆవహించికానీ, మరో రూపంలో కానీ నా మనోగతాన్ని తెలియచేస్తాను’ అని ప్రకటించారని చెబుతారు. -
అందరివాడు గోవిందుడు
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్‌దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్!ఆది శంకరాచార్యులు శ్రీకృష్ణుడిని జగద్గురువుగా కీర్తిస్తూ కృష్ణాష్టకాన్ని విరచించారు. కురుక్షేత్రంలో అర్జునుడికి కర్తవ్య బోధ చేస్తూ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సనాతన ధర్మంలోని సర్వమతాలకు ఆరాధ్య గ్రంథం. అద్వైతాన్ని స్థాపించిన ఆది శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు, ద్వైతాన్ని ప్రతిపాదించిన మధ్వాచార్యులు సహా ఎందరో ఆధ్యాత్మిక గురువులు గీతాచార్యుడైన శ్రీకృష్ణుడిని జగద్గురువుగా తలచి కొలిచి తరించారు. కృష్ణుడు బోధించిన భగవద్గీతకు అనేకమంది ఆధ్యాత్మిక గురువులు వ్యాఖ్యానాలు రాశారు. చైతన్య మహాప్రభువు కృష్ణభక్తికి విస్తృత ప్రచారం కల్పించారు. భక్త జయదేవుడు, మీరాబాయి, సూరదాసు, నామదేవ్ వంటి వారు కృష్ణలీలలను గానం చేశారు. జయదేవుడి అష్టపదులు, మీరబాయి, సూరదాసుల భజన గీతాలు, నామదేవ్ విరచిత అభంగ్లు భారతీయ సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేశాయి. పండితులు, ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే కాదు, బృందావనంలోని గోపికలు మొదలుకొని వ్రేపల్లెలోని ఆబాల గోపాలం సహా సామాన్యులు కూడా కృష్ణుని ఆరాధనలో తరించారు. అందుకే గోవిందుడు అందరివాడని ప్రతీతి పొందాడు. సంభవామి యుగే యుగే లోకంలో అధర్మం ప్రబలినప్పుడు దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ద్వాపర యుగంలో లోకంలో అధర్మం పెచ్చుమీరిన కాలంలో బ్రహ్మదేవుడు, భూదేవి ప్రార్థించగా, శ్రీమహావిషువు దేవకీ, వసుదేవులకు జన్మించ సంకల్పించాడు. అప్పుడు మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలించేవాడు.వసుదేవుడు ఆయన కొడుకు. వసుదేవుడికి యుక్తవయసు రావడంతో ఉగ్రసేన మహారాజు కూతురు దేవకీదేవితో వివాహం జరిపిస్తారు. చెల్లెలు దేవకీదేవిని అత్తవారింట దిగబెట్టేందుకు కంసుడు స్వయంగా రథం నడుపుతాడు. రథం తోవలో ఉండగానే ‘దేవకీదేవి అష్టమ గర్భాన పుట్టిన కొడుకు చేతిలో కంసుడి చావు తప్పదు’ అని అశరీరవాణి హెచ్చరిక వినిపిస్తుంది. ఆ హెచ్చరికతో ఆగ్రహించిన కంసుడు దేవకీదేవిని, వసుదేవుడిని, అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేనుడిని కూడా చెరసాలలో పెడతాడు. చెరసాలలో దేవకీదేవికి జన్మించిన ఆరుగురు శిశువులను కంసుడు దారుణంగా చంపేస్తాడు. దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భస్రావం జరిగిందని అనుకుంటారు. కొన్నాళ్లకు దేవకీ దేవి ఎనిమిదోసారి గర్భం ధరిస్తుంది. శ్రావణ శుద్ధ అష్టమినాడు అర్ధరాత్రివేళ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన జన్మిస్తాడు. వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయట నిద్రిస్తున్న కావలి భటులను తప్పించుకుని యమునానది వైపు బయలుదేరుతాడు. యమునానది రెండుగా చీలి వసుదేవుడికి దారి ఇస్తుంది. వ్రేపల్లెలోని నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళతాడు. నందుడి భార్య యశోద పక్కన కృష్ణుడిని విడిచి, ఆమె పక్క నిద్రిస్తున్న శిశువును ఎత్తుకుని తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. చెరసాలకు రాగానే ఆ శిశువు ఏడుస్తుంది. దేవకికి శిశువు పుట్టిన సమాచారం తెలుసుకుని, కంసుడు హుటాహుటిన చెరసాలకు చేరుకుంటాడు. శిశువును చంపడానికి పైకి విసిరికొడతాడు. అయితే, ఆ శిశువు ఆకాశమార్గానికి ఎగసి, అష్టభుజాలతో, శంఖ చక్ర గదాది ఆయుధాలతో కనిపిస్తుంది. తాను యోగమాయనని, కంసుడిని చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడని చెప్పి అదృశ్యమవుతుంది. కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లెలోని యశోదాదేవి, నందుల వద్ద పెరిగాడు. ఆబాలగోపాలుడు యోగమాయ హెచ్చరికతో ప్రాణభయం పట్టుకున్న కంసుడు దేవకీ గర్భాన పుట్టినవాడు ఎక్కడ ఉన్నా, వెతికి వాడిని చంపాలంటూ తన వద్దనున్న రాక్షసులను పురమాయిస్తాడు. కంసుడు పంపగా వచ్చిన పూతనను పాలుతాగే వయసులోనే సంహరించాడు బాలకృష్ణుడు. బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసుడిని, ధేనుకాసురుడిని, బకాసురుడు తదితరులను వధించాడు. దోగాడే వయసులోనే చిన్నికృష్ణుడు తెగ అల్లరి చేసేవాడు. అతడి అల్లరిని అరికట్టడానికి నడుముకు తాడు చుట్టి, దానిని రోలుకు కట్టేస్తుంది యశోద. నడుముకు అంత పెద్ద రోలు ఉన్నా, దాంతోనే పాకుతూ పోయి రెండు మద్ది చెట్లను కూల్చి, వాటి రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడు. ‘తమ్ముడు మట్టి తింటున్నాడు’ అంటూ బలరాముడు ఫిర్యాదు చేయడంతో, ‘ఏదీ నోరు తెరువు’ అని గద్దించిన యశోదకు తన నోటిలోనే పద్నాలుగు లోకాలనూ చూపి, ఆమెకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాడు. అన్న బలరాముడితో కలసి, వ్రేపల్లెలోని గోపబాలకులతో ఆవులను మేతకు తీసుకుపోయే వాడు. వారితో ఆటలాడుకునేవాడు. వెదురును వేణువుగా మలచి, అద్భుతమైన వేణుగానంతో ఆబాలగోపాలాన్నీ మైమరపించి వేణుగోపాలుడిగా, వంశీమోహనుడిగా ప్రఖ్యాతి పొందాడు. కాళిందినదిలో ఉంటూ గోపాలురను భయభ్రాంతులు చేస్తున్న కాళీయుని తలపై నృత్యం చేసి, కాళింది నుంచి దూరంగా తరిమికొట్టి తాండవ కృష్ణుడిగా పేరు పొందాడు. ఇంద్రుడు వర్షబీభత్సం సృష్టించినప్పుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై నిలిపి, వ్రేపల్లె వాసులను ఆ కొండ నీడలోకి చేర్చి, వారిని కాపాడి, వారి మనసుల్లో భగవంతుని స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో మురిపించి, ఆపత్సమయాల్లో ఆదుకుని వ్రేపల్లెలోని ఆబాలగోపాలాన్నీ అలరించాడు. కృష్ణుడిని ఎలాగైనా చంపాలనే పథకంలో ఉద్ధవుడిని దూతగా పంపి, కృష్ణ బలరాములను మధురకు రప్పిస్తాడు కంసుడు. చాణూర ముష్టికులనే మల్లులను బాలురైన కృష్ణబలరాముల మీదకు ఉసిగొల్పుతాడు. చాణూర ముష్టికులను వధించాక, కంసుడిని సంహరించి, తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను, తాత ఉగ్రసేనుడిని చెరసాల నుంచి విడిపిస్తాడు. ఉగ్రసేనుడికి రాజ్యాన్ని అప్పగించి, దేవకీ వసుదేవులతో కలసి ద్వారకకు చేరుకుంటాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యాభ్యాసం కోసం సాందీపని మహాముని ఆశ్రమంలో చేరుతారు కృష్ణబలరాములు. బాల్యంలోనే మరణించిన గురుపుత్రుని బతికించి తెచ్చి, గురుదక్షిణ సమర్పించుకుంటారు. సాందీపని మహాముని గురుకులంలోనే విద్యాభ్యాసం చేసిన కుచేలుడు శ్రీకృష్ణుడికి ప్రాణస్నేహితుడవుతాడు. గురుకులం విడిచిపెట్టిన తర్వాత పేదరికంలో కూరుకుపోయిన కుచేలుడు అటుకుల మూటతో తన వద్దకు వచ్చినప్పుడు అతడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి, అడగకపోయినా అతడి దారిద్య్రాన్ని తీర్చి, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. కృష్ణాష్టమి వేడుకలు శ్రీకృష్ణాష్టమి వేడుకలు దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతాయి. కృష్ణాష్టమినే గోకులాష్టమి అని, జన్మాష్టమి అని కూడా వ్యవహరిస్తారు. కృష్ణాలయాలలో మాత్రమే కాకుండా, అన్ని వైష్ణవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరుమలలోని శ్రీనివాసుని పక్కనే కొలువై ఉన్న శ్రీకృష్ణుని రజతమూర్తికి పూజలు చేస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజున సాయంత్రంపూట శ్రీవారు ప్రత్యేకంగా కొలువుతీరుతారు. ఈ కొలువును ‘గోకులాష్టమి ఆస్థానం’గా వ్యవహరిస్తారు. స్వామివారు సర్వాలంకార భూషితుడై సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి వేంచేస్తారు. పౌరాణికులు భాగవతంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని పఠిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో ఉట్టెల పండుగ ఘనంగా జరుగుతుంది. శ్రీకృష్ణుని బాల్యక్రీడా విశేషమైన ఈ వేడుకను తిరుమలలో తాళ్లపాక అన్నమాచార్యులు క్రీస్తుశకం 1545లో ప్రత్యేకంగా ప్రారంభించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తోంది. కృష్ణాష్టమి సందర్భంగా దేశంలోని చాలా చోట్ల ఉట్టెకొట్టే వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. గుజరాత్‌లోని ద్వారకలోను, ఉత్తరప్రదేశ్‌లోని మథురలోను, బృందావనంలోను కృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. ద్వారకలోని ద్వారకాధీశ ఆలయంలోను, బృందావనంలోని రాధా మదనమోహన మందిరం, బంకె బిహారి మందిరం, జుగల్‌కిశోర్ మందిరం, ప్రేమ్ మందిరం, రాధారమణ ఆలయాలలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతాయి. ఒడిశాలోని పూరీ శ్రీజగన్నాథ ఆలయంలోను, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయంలోను, హంపి బాలకృష్ణాలయంలోను, మైసూరు వేణుగోపాల స్వామి ఆలయంలోను, కేరళ గురువాయూర్లోని గురువాయూరప్పన్ ఆలయంలోను, రాజస్థాన్‌లోని నాథ్వాడాలో ఉన్న శ్రీనాథ్జీ ఆలయంలోను, తమిళనాడులో దక్షిణ ద్వారకగా పేరుపొందిన తిరువారూరులోని రాజగోపాల ఆలయంలోను, చెన్నైలోని పార్థసారథి ఆలయంలోను కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ప్రత్యేక అలంకరణలతో ఈ ఆలయాలు కనువిందు చేస్తాయి. ఇవే కాకుండా దేశ విదేశాల్లోని ‘ఇస్కాన్’ మందిరాలు సైతం కృష్ణాష్టమి నాడు భక్తులతో కిటకిటలాడతాయి. శ్రీకృష్ణ స్తోత్రాలు, భజన సంకీర్తనలతో మార్మోగుతాయి. కృష్ణాష్టమి రోజున భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుడికి పూజలు జరుపుతారు. అటుకులు, వెన్న, పెరుగు, పాలు, మీగడ, బెల్లం, పండ్లు నైవేద్యంగా పెడతారు. ఊయలలు కట్టి, బాలకృష్ణుని విగ్రహాలను వాటిలో ఉంచి వాటిని ఊపుతూ పాటలు పాడతారు. మహాభారత సారథి కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు పార్థసారథిగా పేరుపొందాడు. కేవలం అర్జునుడి రథాన్ని మాత్రమే కాదు, యావత్ మహాభారతాన్ని నడిపించినది శ్రీకృష్ణుడే. మేనత్త కొడుకులైన పాండవులతో కృష్ణుడి అనుబంధం ప్రత్యేకమైనది. కృష్ణుడి చెల్లెలు సుభద్ర అర్జునుడిని వరించడంతో కృష్ణార్జునుల అనుబంధం విడదీయరానిదైంది. పాండవులందరూ ప్రతి పనిలోనూ కృష్ణుడి సలహా తీసుకునేవారు. ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగం చేసిన ధర్మరాజు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇస్తాడు. ఆ సభకు వచ్చిన శిశుపాలుడు కృష్ణుడిని, ధర్మరాజును నానా మాటలంటాడు. శిశుపాలుడు కూడా కృష్ణుడి మేనత్త కొడుకే. మేనత్తకు ఇచ్చిన మాట మేరకు నూరు తప్పుల వరకు సహించి, ఆ తర్వాత చక్రాయుధంతో శిశుపాలుడిని తుదముట్టిస్తాడు. శకునితో జూదం ఆడేటప్పుడు మాత్రం ధర్మరాజు కృష్ణుడిని సంప్రదించలేదు. శకుని ఆడిన మాయజూదంలో ఓటమిపాలై పాండవులు అడవుల పాలయ్యారు. దుర్యోధనుడు పురిగొల్పడంతో దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణానికి తెగబడినప్పుడు ఆమె కృష్ణుడినే తలచుకుంటూ రోదిస్తుంది. దూరాన ఉన్నప్పటికీ ఆమె మొర విని తన మహిమతో ఆదుకుంటాడు. జూదంలో ఓడిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం, ఆ తర్వాత విరాటరాజు కొలువులో ఏడాది అజ్ఞాతవాసం గడిపారు. అరణ్యవాసంతో పాండవులకు ఎదురైన అనేక సమస్యలను శ్రీకృష్ణుడే పరిష్కరించాడు. పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని తిరిగి వచ్చాక, వారి రాజ్యాన్ని తిరిగి వారికి అప్పగించాలంటూ కృష్ణుడు స్వయంగా రాయబారానికి వెళతాడు. రాయబారానికి వచ్చిన కృష్ణుడిని దుర్యోధనుడు బంధించబోతే విశ్వరూప ప్రదర్శన చేసి, కౌరవులను హెచ్చరిస్తాడు. విశ్వరూపాన్ని తిలకించడం కోసం పుట్టు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి చూపును ప్రసాదిస్తాడు. కురుక్షేత్రంలో ఆయుధాలు విడిచి, యుద్ధవిముఖుడైన అర్జునుడికి గీతోపదేశంతో కర్తవ్యబోధ చేసి, యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. యుద్ధం ముగిసేంత వరకు పాండవులకు అండదండగా ఉంటాడు. యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ సంధించిన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రభావానికి ఉత్తర గర్భంలోని శిశువు మృత్యువును ఎదుర్కోగా, తన చక్రంతో రక్షణ కల్పిస్తాడు. ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి, పాండవుల తర్వాత రాజ్యభారాన్ని వహిస్తాడు. కృష్ణుడి పరివారం కృష్ణుడు అష్టమహిషులు ఉన్నారు. వారు రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, భద్ర, నాగ్నజితి, మిత్రవింద, లక్షణ. కృష్ణుడికి ఒక్కొక్క భార్యతోను పదేసి మంది పిల్లలు కలిగారు. సత్యభామతో కలసి వెళ్లి నరకాసురుడిని వధించాక, అతడి చెరలో ఉన్న పదహారువేల నూరుమంది గోపికలను కృష్ణుడు బంధవిముక్తులను చేశాడు. వారు శ్రీకృష్ణుని ఆశ్రయంలోనే ఉండేవారు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత కౌరవుల నాశనం చేసినందుకు ఫలితంగా యాదవకులం కూడా నశిస్తుందని గాంధారి శపిస్తుంది. శాపప్రభావం వల్ల కృష్ణుడి కొడుకుల్లో ఒకడైన సాంబుడికి ఆడవేషం వేసి, అతడికి పుట్టబోయేది మగబిడ్డో, ఆడబిడ్డో చెప్పాలంటూ యాదవ యువకులు మునులను ఆటపట్టిస్తారు. దానికి ఆగ్రహించిన మునులు యాదవకులాన్ని నాశనం చేసే ముసలం పుడుతుందని శపిస్తారు. సాంబుడి వేషం విప్పేస్తున్నప్పుడు అతడు కడుపు దగ్గర దాచుకున్న దుస్తుల నుంచి ముసలం పుడుతుంది. భయపడిన యాదవులు దానిని బాగా అరగదీస్తారు. ఎంత అరగదీసినా, చిన్న మొన మిగిలిపోతుంది. దానిని సముద్రతీరంలో పడేస్తారు. కొన్నాళ్లకు అదే ప్రదేశంలో తాగితందనాలాడి గొడవపడిన యాదవులు ఒకరినొకరు చంపుకుని నశించారు. ముసలం మొనతో బాణం తయారు చేసుకున్న ఒక నిషాదుడు జంతువులను వేటాడుతూ విడిచినప్పుడు అది చెట్టు కింద సేదదీరుతున్న కృష్ణుడి పాదానికి తాకుతుంది. బాణం దెబ్బ వల్ల కృష్ణుడు నిర్యాణం చెందినట్లు కొన్ని పురాణాలు చెబుతుంటే, రామానుజాచార్యులు వంటి వైష్ణవ గురువులు శ్రీకృష్ణుడిని జరామరణ రహితుడిగా అభివర్ణించారు. విశిష్టాద్వైతాన్ని పాటించే వైష్ణవులు, గౌడీయ వైష్ణవులు కృష్ణుడిని జరామరణ రహితుడిగానే విశ్వసిస్తారు. -
బాబుపై స్వరూపానందేంద్ర ఫైర్
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మండిపడ్డారు. చంద్రబాబు పరిస్థితి అన్నీ ఉన్నా ఐదోతనం లేనట్టుగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆదిశంకరాచార్యుల విగ్రహం పెట్టాలని అడిగితే చంద్రబాబు స్పందించలేదన్నారు. ఆయన విగ్రహాలున్న తిరుమల, శ్రీశైలం, బదరీ, కేదార్నాథ్ వంటివన్నీ చాలా అభివృద్ధి చెందాయని చెప్పారు. బాబు దీనిపై స్పందించకపోయినా.. రాష్ట్ర అభివృద్ధి కోసం శంకరాచార్యుల విగ్రహాన్ని రాజధానిలో మేమే ప్రతిష్టిస్తామన్నారు. ఏపీ ప్రజలను మభ్యపెట్టి దోచుకునే అలవాటున్న ప్రభుత్వ పెద్దలు నా ప్రతిపాదనలను పట్టించుకోలేదని చెప్పారు. బుద్ధుడు వైరాగ్యం, శూన్య వాదం, నిస్సారమైన ధర్మాన్ని ప్రచారం చేశారు.. అలాంటి బుద్ధుని పేరు పెడితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ప్రతి మహిళ అమ్మవారిలా ఉండాలని కోరుకున్నది శంకరాచార్యులే అని, అందుకే ఆయన విగ్రహాన్ని రాజధానిలో ప్రతిష్టించాలని అన్నారు. -
అసాధారణ ఆదిశంకరులు
రోబో సినిమా గుర్తుందా? అందులో రజనీకాంత్ ఇంతింతలావు పుస్తకాలు కూడా ఒక్క లుక్కుతో స్కాన్ చేసి పడేస్తాడు. తర్వాత ఎక్కడ ఏమున్నదీ ఠకాఠకా చెప్పేస్తాడు. అలాగే ఒక్కసారి వినగానే లేదా ఒక్కసారి చదవగానే ఒక పుస్తకం మొత్తం అక్షరం పొల్లు పోకుండా అప్పచెప్పగలవారు ఉంటారు. అలాంటి వాళ్లని ‘ఏకసంథాగ్రహి’ అంటారు. ఆంజనేయస్వామి ఆ కోవకే చెందుతాడు. ఆ తర్వాత జగద్గురు ఆదిశంకరులు. ఆయన కూడా ఏకసంథాగ్రహే! శంకరాచార్యులవారి ప్రియ శిష్యుడు పద్మపాదుడు ఒకసారి యాత్రలకు బయలుదేరాడు. యాత్రలు చేస్తూ దారిలో ఉన్న మేనమామ ఇంటికి వెళ్లాడు. ఆ ఊరివారందరూ శంకరుల వారి ప్రధాన శిష్యుడైన పద్మపాదుణ్ని చూడటానికి వచ్చారు. ఆయన తన గురువు శంకరాచార్యుల గురించి చెబుతున్నాడు. పద్మపాదుడి దగ్గర ఉన్న ‘సూత్ర భాష్యార్థం’ అనే గ్రంథాన్ని చూశాడు మేనమామ. అందులో ఆ మేనమామ గురువైన ప్రభాకరుల సిద్ధాంతాన్ని పద్మపాదుడు విమర్శించాడు. ఆ మామయ్యకి చాలా కోపం వచ్చింది – అయినా ఆ కోపంపైకి కనిపించనివ్వలేదు. కోపాగ్నికి ఆహుతి ‘‘నీ పుస్తకం చాలా బాగుంది. ఒకసారి చదివి ఇస్తాను. నువ్వు యాత్రలు ముగించుకుని ఇటే వస్తావు కదా! అప్పుడు తీసుకోవచ్చు. పుస్తకం ఇస్తావా?’’ అని అడిగాడు. ‘‘తీసుకో మామయ్య’’ అని దాన్ని ఇచ్చాడు పద్మపాదుడు. పద్మపాదుడు ఇలా బయలుదేరి వెళ్లగానే ఇలా ఆ పుస్తకాన్ని కాల్చిపారేశాడు మేనమామ. పద్మపాదుడు యాత్రలు ముగించుకొని మామయ్య దగ్గరికి వచ్చాడు. పుస్తకం ఇవ్వమని అడిగాడు. ‘‘ఇంకెక్కడి పుస్తకం? అగ్ని ప్రమాదంలో కాలిపోయిందిగా’’ అన్నాడు మామయ్య. ఉన్నది ఒకటే ప్రతి పాపం.. పద్మపాదుడికి ఏడుపొచ్చింది. ఏం చెయ్యాలి? ఆ కాలంలో రచనలన్నీ తాటాకుల మీదనే చేసేవారు. ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీ సాయంతో ఒకేసారి వెయ్యి పుస్తకాలు అచ్చు వేస్తున్నారు. కానీ, ఆ కాలంలో చేత్తోనే రాసేవారు. అందుకని ఒకటే ఉండేది. ఎవరికి కావాలంటే వాళ్లు ఆ పుస్తకాన్ని చూసి రాసుకునేవారు. ఉన్న ఒక్క గ్రంథం కాలిపోతే, ఇక పద్మపాదుడు ఏం చేయగలడు? మళ్లీ రాయాలంటే సాధ్యమవుతుందా? తన బాధ చెప్పుకోవడానికి తన గురువుగారైన శంకరాచార్యుల దగ్గరికి వచ్చాడు – తన గ్రంథం కాలిపోయిందని చెప్పి బాధపడ్డాడు పద్మపాదుడు. శంకరుని పునఃకృతి శంకరాచార్యులు చిరునవ్వు నవ్వాడు. ‘‘నువ్వు రాసేటప్పుడు, ఏ రోజు రాసింది ఆ రోజు నాకు వినిపించావు కదా! నాకు గుర్తున్నంత వరకూ చెబుతాను – రాసుకో’’ అన్నాడు శంకరాచార్యులు. పద్మపాదుడు రాయడానికి కూర్చున్నాడు. ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చెప్పాడు శంకరాచార్యులు. పద్మపాదుడి ఆనందం అంతా ఇంతా కాదు. శంకరాచార్యుల ధారణశక్తి ఎంత గొప్పదో కదా! ఇది ఒక గ్రంథం మాత్రమే కదా! ఇంకో సంఘటనలో మూడు నాటకాలు తిరిగి చెప్పారు! కేరళ ప్రభువు రాజశేఖరుడు మూడు నాటకాలు రచించి, శంకరాచార్యులవారికి చూపించాడు. కొంతకాలం గడిచింది. ఆ నాటకాలు పోయినయి. రాజు చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి శంకరాచార్యులని కలిసినప్పుడు మాటల సందర్భంలో నాటకాల సంగతి చెప్పాడు రాజశేఖరుడు. ‘‘నేను చెబుతాను రాసుకో’’ అన్నాడు శంకరాచార్యులు. ఉన్నదున్నట్లుగా మూడు నాటకాలు చెప్పడంతో రాజు ఆనందించాడు. శంకరులకున్న ఈ విద్యనే ధారణ అంటారు. అంటే కాన్సన్ట్రేషన్తో విని గుర్తు పెట్టుకోవడం. ఒకసారి కాకపోతే మానె, కనీసం నాలుగైదుసార్లు చదివినా సరే, పిల్లలకు గుర్తుండిపోతే చాలదూ! శంకరుల వారు పుట్టిన తిథి నేడు. వారిని స్మరించుకోడానికి ఇదొక సందర్భం. – డి.వి.ఆర్. -
తెప్పించే దారులు
ధర్మ సందేహాలు, సంకటాలు భక్తులకే ఉంటాయని కదా అనుకుంటాం! ఆ సందేహాలన్నింటినీ చక్కగా తీరుస్తుండే ఆధ్యాత్మికవేత్తలు సైతం కొన్ని సందర్భాలలో ధర్మ సంకటంలో పడిపోతుంటారు!! ‘జీవాత్మ, పరమాత్మ వేర్వేరు కాదు’ అనే భావనపై ‘అద్వైత’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరాచార్యుల వారు క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో నాలుగు హిందూ పీఠాలను స్థాపించారు. ఆ నాలుగు పీఠాలలో ఒకటైన జ్యోతిర్మఠానికి (బదరీనాథ్) ఇప్పుడు కొత్తగా ‘శంకరాచార్య’ కావలసి వచ్చారు. ఖాళీ అయిన ఆ ఆధ్యాత్మిక పీఠాన్ని భర్తీ చేయడం కోసం అర్హులైన సాధువుల నుంచి ఇటీవలే భారత మహాధర్మ మండలి దరఖాస్తులు ఆహ్వానించింది. దాదాపు రెండు వందల దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటినీ సూక్ష్మంగా వడబోసి, చివరికి నలుగురు సాధువులతో ఒక జాబితాను మండలి సిద్ధం చేసింది. విశేషం ఏమిటంటే.. ఆ నలుగురిలో ఒకరు మహిళ! ‘శంకరాచార్య’ పదవి చేపట్టడానికి మిగతా ముగ్గురితో సమానంగా అన్ని అర్హతలున్న ఆ సాధ్వి పేరు.. హేమానంద్ గిరి. నేపాల్ ఝంపా జిల్లా పరిధిలోని గౌరీగంజ్‌లో ఉన్న ‘సూర్యశివ’ మఠానికి ప్రస్తుత ఆచార్యురాలు. ఇలా ఒక మహిళ ‘శంకరాచార్య’ స్థానానికి పోటీ పడటం గత పన్నెండు వందల ఏళ్ల చతుర్మఠాల చరిత్రలోనే మొదటì సారి అవడంతో.. ఒకవేళ మహిళనే ఎంపిక చేయవలసి వస్తే ధర్మశాస్త్రాలు అంగీకరిస్తాయా అన్న విషయమై మహా ధర్మ మండలి ఇప్పుడు మీమాంసలో పడిపోయింది! ఆది శంకరాచార్యులు రాసిన ‘మహానుశాసనం’లో ఇందుకు ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని కూడా మండల సభ్యులు శోధిస్తున్నారు. ప్రస్తుతానికైతే పరిష్కారం దొరకలేదు కానీ, శంకరాచార్య అవడానికి కనీస అర్హత ‘దండి’ స్వామి అయి ఉండటం అనే నిబంధన వారి కంటబడింది. అయితే హేమానంద్ గిరి.. ‘దండి’ స్వామి కాదు. కాలేరు కూడా! ఎందుకంటే.. హైందవ «ధర్మశాస్త్రాలు పురుషులను మాత్రమే దండి స్వామిగా అంగీకరిస్తున్నాయి. మరేమిటి సాధనం? మహిళలను ‘తప్పించే’ దారులను వదిలిపెట్టి, ‘తెప్పించే’ దారుల కోసం వెదకడమే. అవును. ఒక కొత్త ఒరవడిని నెలకొల్పాలన్న సదుద్దేశంతో, పూర్వపు నియమాలలో స్వల్ప సడలింపులను చేసుకుంటే అది తప్పు కాబోదు, ధర్మం తప్పినట్టూ అవదు. -
తనకేమీ తెలియదని తెలుసుకున్నవాడు జ్ఞాని
అధ్యాపకుడు అంటే ఏది చదవాలో అది చదివిస్తాడు. ఏ చదువయినా ఈశ్వరుడి దగ్గరకు చేరుకునేటట్లు చేస్తాడు. గురువు వినీతుడు. శిష్యుడు వినేయుడు. గురువుచేసే మొదటి పని వినయాన్ని నేర్పడం. అసలు విద్య అన్న మాటకు ఒక అర్థం–విత్ అంటే తెలుసుకొనుట. రెండవ అర్థం–నాకేమీ తెలియదని తెలుసుకొనుట. కానీ మానవ నైజం ఏమిటంటే– సరస్వతీ కటాక్షం లేదంటే (నీ కేమీ తెలియదంటే) ఎవ్వడూ ఒప్పుకోడు. లక్ష్మీకటాక్షం (పుష్కలంగా సంపద/డబ్బు) ఉందంటే ఒప్పుకోడు. ‘నాకేం తెలుసండీ’ అనగలగాలంటే చాలా తెలిసి ఉండాలి. కొన్ని తెలుసుకున్న తరువాత... ‘ఎన్ని గ్రంథాలున్నాయి, ఎంతమంది రుషులున్నారు, ఎన్నిదర్శనాలు, ఎంతమంది మహానుభావులు. అవన్నీ చదవడానికి నా జీవితం ఏం సరిపోతుంది. దీనికే సరిపోకపోతే ఇక వాటిని ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకోవాలి... అయ్యబాబోయ్, నాకేం తెలియదండీ’ అంటాడు. బాగా తెలిసున్నవాడి లక్షణం నాకేమీ తెలియదని వినయంతో ఉండడం. సుందరకాండలో సీతమ్మ హనుమని పిలిచి–‘అంతమంది వానరులొచ్చి అటుపక్కన సముద్రపు ఒడ్డున ఉండిపోయారు కదా, నువ్వొకడివే కదా ఇక్కడికి వచ్చావు, రేపు రామ– రావణ యుద్ధం జరిగితే ఎంతమంది వానరులు వస్తారు’ అని సందేహం వ్యక్తం చేస్తే హనుమ అంటాడు ‘‘అమ్మా! నీకు తెలుసుకదా, రాణివాసంలోని మహారాణి దగ్గరకు ఎవర్నయినా పంపాల్సి వచ్చినప్పుడు ప్రభువులు తమ దగ్గరున్న సేవకుల్లో అందరికన్నా పనికిమాలిన వాడెవడో వాడిని పంపిస్తారు. అమ్మా, సుగ్రీవుడు నన్ను పంపించాడంటే–నాతో సమానులు, నాకన్నా అధికులున్నారు కానీ, నాకన్నా తక్కువ వాళ్ళు అక్కడ లేరమ్మా’’ అన్నాడు. అదీ వినయం. అందుకే హనుమ పాదాలు పట్టుకుంటే బుద్ధి, వినయం లభిస్తాయంటారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యులొకసారి ‘మిమ్మల్ని జగద్గురువని సంబోధించాలని ఉంది... అలా పిలవొచ్చా– అని అడిగారు. దానికాయన ‘‘జగద్గురువంటే ఒక సమాసం ప్రకారం ‘జగత్తునంతా గురువుగా కలిగినవాడు’ అనే అర్థంలో నేను ఎప్పుడూ జగద్గురువునే. ఎందుకంటే ఇంతమందిని చూసి నేను ప్రతిరోజూ నేర్చుకుంటున్నాను కనుక’ అన్నారు. అదీ ఆయన వినయం. శిష్యుడు అంటే శిక్షింపబడేవాడు. వినయం ఉండి ఇంద్రియములు శిక్షింపబడిన వాడు శిష్యుడు. గురువుగారి పేరు వినబడినా, ఆయన కనబడినా ఇంద్రియాలు అదుపులోకి రావాలి. చూడకూడనిది కన్ను చూడదు, స్మరించకూడనివి మనసు స్మరించదు, వినకూడనివి చెవులు వినవు. అలా ఇంద్రియాలను శిక్షించుకుని, నిగ్రహించుకుని, శమదమాదులు నేర్చుకుని గురువు ముందు కూర్చున్నవాడు శిష్యుడు. అందుకే శంకరాచార్యులవారు షట్పదీ స్తోత్రం చేసూ ్త‘నా అవినయాన్ని తీసేసి వినయాన్ని కటాక్షించు’ అన్నారు. మొదట వినయం నేర్పినవాడు గురువు, ఆయన అధ్యాపకుడు. చదువు నేర్పుతాడు. ఉపాధ్యాయుడు అని మరో పేరు. అనేకమైన క్రియాకలాపాల వల్ల గురువు ఇన్ని పేర్లతో పిలవబడతాడు. లౌకికంగా అర్థం చెప్పాలంటే – కొంత ద్రవ్యాన్ని జీతంగా తీసుకుని పాఠం చెప్పేవాడు ఉపాధ్యాయుడు అని. మరొక అర్థంలో – కుమారుడికి ఉపనయనంచేసే తండ్రి చెపుతున్నట్లుగా ‘‘ఉపేధ్య–తస్మాత్ అధీయతా’’ ఉపేధ్య అంటే వెళ్ళు. ఆయన దగ్గరకు వెళ్ళు, తస్మాత్ అధీయతా.. ఇప్పుడు ఆ మహానుభావుడి దగ్గరకువెళ్ళి నేర్చుకో అని తండ్రి ఎవరివంక చేయి చూపించి పంపుతాడో, ఎవరు వేదం నేర్పుతారో ఆయన ఉపాధ్యాయుడు. -
స్వామి బస్సుకు పన్ను రద్దు!
స్వామి స్వరూపానంద సరస్వతి కోసం శంకరాచార్య జోతిష్యపీఠం ప్రత్యేకంగా తెప్పించిన రూ.1.30 కోట్ల లగ్జరీ బస్సుపై పన్నును రద్దు చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో దాదాపు రూ.11లక్షల రోడ్డుపన్నును మినహాయింపు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. బస్సు ఖరీదు రూ.15 లక్షలు కాగా, వాష్ రూమ్, లిఫ్ట్, బెడ్ తదితర వసతులు దానిలో అమర్చడంతో మొత్తం రూ.1.30 కోట్లు అయినట్లు వివరించారు. గత ఏడాది ఈ బస్సును కొనుగోలు చేయగా, స్వామి శిష్యులు పన్ను రద్దు చేయాలని కోరుతూ అధికారులను ఆశ్రయించారు. దీనికి రోడ్లు, భవనాల శాఖ ఒప్పుకోకపోవడంతో హోంశాఖ మంత్రి బాబులాల్ గౌర్ ప్రభుత్వాన్ని ట్యాక్స్ రద్దు చేసేందుకు ఒప్పించినట్లు సమాచారం. ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించిన సింహస్త కార్యక్రమంలో ప్రభుత్వం ఈ విషయానికి తలూపినట్లు తెలిసింది. కార్యక్రమాన్ని నిర్వహించిన రవాణాశాఖ మంత్రి భూపేంద్రసింగ్ శంకరాచార్య పీఠం నుంచి సాయాన్ని కోరారు. ఇందుకు ప్రతిఫలంగానే ట్యాక్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఒప్పందం కుదిరినట్లు ఏం మాట్లాడలేదు. -
'అయోధ్యలో రామ మందిరాన్ని మేమే నిర్మిస్తాం'
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతామని ద్వారక పీఠాధిపతి, అధ్యాత్మిక మతగురువు సద్గురు స్వరూపానంద సరస్వతి శంకరాచార్య తెగేసి చెప్పారు. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిస్తే రాజకీయ మద్దతు లేకున్నా రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు ఇకనైనా రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడం ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మ సంసద్ ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో మెజారిటీ లేకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చట్టం తీసుకు రావడం సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. మొఘల్ రాజు బాబర్ పేరుతో రాజకీయం చేయాలని కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని శంకరాచార్య స్వరూపానంద మండిపడ్డారు. అయోధ్య హిందువుల పవిత్ర స్థలం అనే వాస్తవాన్ని ఆయన గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపైనా, ఎన్డీయే సర్కారుపైనా శంకరాచార్య విరుచుకుపడ్డారు. 'మీకు చేతులెత్తి నమస్కరిస్తా.. దయచేసి రామ జన్మభూమి గురించి మాట్లాడకండి. మేం అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తాం. దేవుడి దయ వల్ల రాజకీయ నాయకులు డబ్బులు మాకు అవసరం లేదు. దయచేసి ఈ చర్చను ఆపండి.. ప్రజలు, సాధువులు సహాయ సహకారాలతో మేము రామ మందిరాన్ని నిర్మిస్తాం' అన్నారు. నాయకుల్లో ఆధ్మాత్మిక పరిజ్ఞానం కొరవడిందని ఆగ్రహం ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ జపాన్ రాజుకు భగవద్గీతను బహుమతి ఇవ్వడానికి బదులుగా భారతదేశంలో పిల్లలకు గీతను ప్రబోధించే ఏర్పాటు చేసి ఉంటే తాను ఇంకా సంతోషించేవాడినని వ్యాఖ్యానించారు. -
మాంసం తినే సాయి.. హిందూ దేవుడెలా?
షిరిడీ సాయి దైవత్వాన్ని శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరోసారి ప్రశ్నించారు. అల్లాను కొలుస్తూ.. మాంసం తినే సాయి బాబా హిందూ దేవుడు ఎలా అవుతారని ఆయన అన్నారు. సాయి భక్తులు కూడా సనాతన దేవుళ్ల బొమ్మలతో సొమ్ము చేసుకున్నారని, వాళ్లు మన దేవుడి బొమ్మలు ఉపయోగించకపోతే వాళ్లకు ఎవరూ ఏమీ ఇవ్వరని చెప్పారు. ప్రజలకు ఎవరిని కావాలంటే వారిని కొలుచుకునే హక్కు, స్వేచ్ఛ ఉన్నాయని.. అయితే సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకొనే ప్రయత్నం చేయడం మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని స్వరూపానంద అన్నారు. తాము కేవలం ఐదుగురు దేవుళ్లనే ఆమోదిస్తామని, వేరే ఎవరైనా తమను తాము అక్కడ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆమోదించేది లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రోద్బలంతోనే తాను సాయిబాబాపై గళమెత్తానన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తాను రాజకీయవాదిని కానని స్పష్టం చేశారు. మరోవైపు నాగా సాధువులు కూడా శంకరాచార్యకు మద్దతుగా నిలిచారు. శంకరాచార్యను ఎవరైనా అవమానిస్తే తాము వీధుల్లో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ అంశాన్ని వారు ఆధ్యాత్మిక యుద్ధంగా కూడా చెప్పారు. -
బాబా దేవుడు కాదా ? - ప్రత్యేక చర్చ2
-
బాబా దేవుడు కాదా ? - ప్రత్యేక చర్చ1
-
బాబా దేవుడు కాదా ?.. మీరింతకీ స్వాములేనా?