స్వామి బస్సుకు పన్ను రద్దు! | MP government waives tax on Shankaracharya’s luxury bus worth 1.35 crores | Sakshi
Sakshi News home page

స్వామి బస్సుకు పన్ను రద్దు!

Published Wed, Jun 8 2016 5:39 PM | Last Updated on Mon, Oct 8 2018 3:28 PM

స్వామి బస్సుకు పన్ను రద్దు! - Sakshi

స్వామి బస్సుకు పన్ను రద్దు!

స్వామి స్వరూపానంద సరస్వతి కోసం శంకరాచార్య జోతిష్యపీఠం ప్రత్యేకంగా తెప్పించిన రూ.1.30 కోట్ల లగ్జరీ బస్సుపై పన్నును రద్దు చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో దాదాపు రూ.11లక్షల రోడ్డుపన్నును మినహాయింపు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. బస్సు ఖరీదు రూ.15 లక్షలు కాగా, వాష్ రూమ్, లిఫ్ట్, బెడ్ తదితర వసతులు దానిలో అమర్చడంతో మొత్తం రూ.1.30 కోట్లు అయినట్లు వివరించారు. గత ఏడాది ఈ బస్సును కొనుగోలు చేయగా, స్వామి శిష్యులు పన్ను రద్దు చేయాలని కోరుతూ అధికారులను ఆశ్రయించారు. దీనికి రోడ్లు, భవనాల శాఖ ఒప్పుకోకపోవడంతో హోంశాఖ మంత్రి బాబులాల్ గౌర్ ప్రభుత్వాన్ని ట్యాక్స్ రద్దు చేసేందుకు ఒప్పించినట్లు సమాచారం.

ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించిన సింహస్త కార్యక్రమంలో ప్రభుత్వం ఈ విషయానికి తలూపినట్లు తెలిసింది. కార్యక్రమాన్ని నిర్వహించిన రవాణాశాఖ మంత్రి భూపేంద్రసింగ్ శంకరాచార్య పీఠం నుంచి సాయాన్ని కోరారు. ఇందుకు ప్రతిఫలంగానే ట్యాక్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఒప్పందం కుదిరినట్లు ఏం మాట్లాడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement