luxury bus
-
RTC Buses: బస్సులో ఓ చార్జి .. కౌంటర్లో మరో చార్జి.. ఎందుకీ గందరగోళం?
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ బస్సు చార్జి రూ.280. బస్సులో ఈ మొత్తానికే టికెట్ జారీ అవుతోంది. అదే బస్టాండులోని కౌంటర్లో టికెట్ కొంటే మాత్రం రూ.310 చార్జి అవుతోంది. అన్నిచోట్లా ఇలాగే జరుగుతోంది. ఒకే ప్రాంతానికి వెళ్లే, ఒకే కేటగిరీ బస్సు అయినా.. బస్సులో కండక్టర్/డ్రైవర్ జారీ చేసే టికెట్ ధరకూ, బస్టాండ్లలోని కౌంటర్లలో తీసుకునే టికెట్ ధరకూ పొంతన ఉండటం లేదు. ఇలా బస్సులో ఒకలా, కౌంటర్లో మరోలా జారీ అవుతున్న టికెట్లు ప్రయాణికులను అయోమయానికి గురి చేస్తున్నాయి. దీంతో కొన్నిసార్లు సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఎందుకీ గందరగోళం.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లలో అక్కడి నుంచే ప్రారంభమయ్యే బస్సు ప్లాట్‌ఫామ్ మీదకు రావటానికి కొన్ని నిమిషాల ముందు నుంచి అక్కడి కౌంటర్లలో నిర్ణీత ప్రాంతానికి/నగరానికి టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవర్లే టిమ్ (టికెట్ జారీ యంత్రం) ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి అదే ప్రాంతం లేదా నగరానికి వెళ్లే బస్సుల్లో కూడా టిమ్‌లతో టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే బస్సుల్లో టిమ్స్‌తో జారీ చేసే టికెట్ ధర కంటే కౌంటర్లలో ఇచ్చే టికెట్ చార్జి అధికంగా ఉంటోంది. గత కొంతకాలంగా ఈ వ్యత్యాసం కనిపిస్తోంది. ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమే కారణం గతంలో కౌంటర్లలో ఇచ్చే టికెట్, బస్సుల్లో ఇచ్చే టికెట్ ఒకే సాఫ్ట్వేర్ ద్వారా జరిగేది. అదే అడ్వాన్స్డ్ రిజర్వేషన్ అయితే మరో పద్ధతి ఉండేది. ప్రయాణానికి చాలా ముందుగా సీటు రిజర్వ్ చేసుకునేందుకు టికెట్ కొంటే అదనంగా చార్జి చేసే పద్ధతి ఎప్పట్నుంచో ఉంది. కచ్చితంగా సీటు రిజర్వ్ చేసే వెసులుబాటు ఉన్నందున, ఆ సేవకు గాను రూ.30 చార్జి చేస్తారు. గతంలో రూ.10గా ఉన్న ఈ చార్జిని ఇటీవల డీజిల్ సెస్ పెంచిన సమయంలో సవరించి రూ.30కి పెంచారు. ఇలా ముందస్తుగా సీట్లు రిజర్వ్ చేసేందుకు వినియోగించే సాఫ్ట్‌వేర్‌నే ఇప్పుడు కామన్‌గా వాడుతున్నారు. ఆర్టీసీ అధీకృత ప్రైవేటు ఏజెంట్లు, ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు, ఆర్టీసీ స్పాట్ టికెట్ జారీ చేసే కౌంటర్లు.. ఇలా అన్నింటా ఒకటే వాడుతున్నారు. బస్టాండ్లలో సాధారణ టికెట్లు జారీ చేసే చోట కూడా ఇదే సాఫ్ట్వేర్ ఉండటంతో, బస్సు బయలు దేరటానికి కొన్ని నిమిషాల ముందు టికెట్ కొన్నా.. అడ్వాన్స్డ్ రిజర్వేషన్ చార్జి పడుతోంది. ఫలితంగా బస్సులో సాధారణ టిమ్ ద్వారా జారీ చేసే టికెట్‌కు, కౌంటర్లో ఉండే ఓపీఆర్ఎస్ (ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) టికెట్‌కు ఈ తేడా కనిపిస్తోంది. అప్పటికప్పుడు ప్రయాణం కోసం వచ్చే వారు, కౌంటర్లో టికెట్ కొని ఈ రిజర్వేషన్ చార్జి చూసి కంగుతింటున్నారు. ఇదేంటని సిబ్బందిని నిలదీస్తే, ఇందులో తమ ప్రమేయమేమీ ఉండదని, సిస్టంలో లోడ్ చేసిన మేరకు ఆటోమేటిక్‌గా టికెట్ చార్జి వస్తుందని చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తమకు కౌంటర్లో కాకుండా, బస్సు లో టిమ్ ద్వారా టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అలా ఇవ్వలేమని, కౌంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అలాగే కొన్ని సర్వీసులకు టిమ్ ద్వారా టికెట్ జారీ ఉండదని, అందువల్ల కచ్చితంగా కౌంటర్లోనే తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కాకున్నా రూ.30 అదనంగా సమర్పించుకోవాల్సి వస్తోంది. -
సీఎం బస్సు.. ఎంత హైటెక్కో!
లక్నో : అభివృద్ధి నుంచి విజయం దిశగా..' ఇదీ యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నవంబర్ మూడో తేదీ నుంచి మొదలుపెట్టబోతున్న రథయాత్ర పేరు. ఇందుకోసం ఆయన అత్యాధునిక బస్సు ఒకదాన్ని సిద్ధం చేయించుకున్నారు. దాంట్లో ఉన్న సదుపాయాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే. వచ్చే సంవత్సరం జరగబోతున్న ఎన్నికల కోసం ఈ బస్సును అఖిలేశ్ ఎప్పుడో రెడీ చేయించారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దగ్గరున్న వ్యానిటీ వ్యాన్ కంటే కూడా ఇది చాలా పెద్దది. వాస్తవానికి ఈ వ్యాన్‌లో అఖిలేశ్ ఈ నెల 3 నుంచే ప్రచారం ప్రారంభించాలనుకున్నారు గానీ.. యాదవ్ కుటుంబంలో చెలరేగిన చిచ్చు కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక పార్టీలోను, కుటుంబంలోను ఉన్న అంతర్గత తగాదాలను కాసేపు పక్కన పెట్టి.. ప్రచారం సంగతి చూసుకుందామని సిద్ధమవుతున్నారు. వచ్చే నెల మూడో తేదీన లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఎదురుగా ఉన్న లా మార్టినెర్ స్కూలు గ్రౌండ్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. తొలి రెండు రోజులు యాత్ర పూర్తయ్యాక వెంటనే మళ్లీ లక్నో వచ్చి.. పార్టీ రజతోత్సవాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇంతకు ముందున్న నాలుగు చక్రాల బస్సులు, ట్రక్కులలా కాకుండా సీఎం విజయరథాన్ని అత్యాధునికంగా రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి, తమకు కావల్సిన సదుపాయాలన్నింటినీ అందులో కల్పించుకున్నారు. మామూలుగా అయితే రూ. 50 లక్షల వరకు ఖర్చయ్యే ఈ బస్సుకు.. మేకోవర్ తర్వాత దాదాపు కోటి రూపాయల వరకు అయినట్లు సమాచారం. ప్రచారం కోసం అఖిలేశ్ యాదవ్ హైటెక్ బస్సులు వాడటం ఇది మొదటిసారేమీ కాదు.. ఇంతకుముందు 2012 ఎన్నికల సమయంలో కూడా ఆయన 'క్రాంతి రథం' ఉపయోగించారు. అయితే అప్పట్లో దాన్ని తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి తీసుకున్నారు. అప్పట్లో కూడా ఆయన రాష్ట్రం మొత్తం ఒక్కరే తిరిగారు. పార్టీలో మిగిలిన సీనియర్లంతా వేదికల మీద నుంచి ప్రసంగిస్తే.. అఖిలేశ్ మాత్రం ఆ ర్యాలీలు వేటిలోనూ పాల్గొనకుండా నేరుగా బస్సులోంచే తన యువదళం మద్దతుతో ప్రచారం చేశారు. తాజాగా అఖిలశ్ యాదవ్ చేపట్టే యాత్ర మార్గం ఇంకా నిర్ణయించాల్సి ఉంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ పని పూర్తవుతుందని అఖిలేశ్ మంత్రివర్గ సహచరుడు రాజేంద్ర చౌదరి తెలిపారు. ఐదో తేదీన రాజధాని లక్నోలో జరిగే పార్టీ రజతోత్సవాలలో పాల్గొని, మళ్లీ తన యాత్రను సీఎం పునరుద్ధరిస్తారన్నారు. కాగా గతంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ఎన్నికల ప్రచారం కోసం అన్ని హంగులతో కూడిన లగ్జరీ బస్సులను ప్రత్యేకంగా చేయించుకున్న విషయం తెలిసిందే బస్సులో ఉన్న సౌకర్యాలు ఇవీ... ఇది పది చక్రాల మెర్సిడెస్ బస్సు బస్సు మొత్తం పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ ప్రజలనుద్దేశించి అఖిలేష్ మాట్లాడేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్టు హై ఫిడెలిటీ సౌండ్ సిస్టమ్ వీడియోలు చూపించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు వెనక్కి సులభంగా వాలే మెకనైజ్డ్, హైడ్రాలిక్ కుర్చీలు బస్సులోనే రెస్ట్ రూం, వంటగది, ప్లష్ వాష్‌రూం వై-ఫై సదుపాయం, వై-ఫై అనుసంధానం ఉన్న టీవీ అత్యాధునిక ఏసీ సిస్టమ్, గాలిశుద్ధి పరికరాలు -
స్వామి బస్సుకు పన్ను రద్దు!
స్వామి స్వరూపానంద సరస్వతి కోసం శంకరాచార్య జోతిష్యపీఠం ప్రత్యేకంగా తెప్పించిన రూ.1.30 కోట్ల లగ్జరీ బస్సుపై పన్నును రద్దు చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో దాదాపు రూ.11లక్షల రోడ్డుపన్నును మినహాయింపు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. బస్సు ఖరీదు రూ.15 లక్షలు కాగా, వాష్ రూమ్, లిఫ్ట్, బెడ్ తదితర వసతులు దానిలో అమర్చడంతో మొత్తం రూ.1.30 కోట్లు అయినట్లు వివరించారు. గత ఏడాది ఈ బస్సును కొనుగోలు చేయగా, స్వామి శిష్యులు పన్ను రద్దు చేయాలని కోరుతూ అధికారులను ఆశ్రయించారు. దీనికి రోడ్లు, భవనాల శాఖ ఒప్పుకోకపోవడంతో హోంశాఖ మంత్రి బాబులాల్ గౌర్ ప్రభుత్వాన్ని ట్యాక్స్ రద్దు చేసేందుకు ఒప్పించినట్లు సమాచారం. ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించిన సింహస్త కార్యక్రమంలో ప్రభుత్వం ఈ విషయానికి తలూపినట్లు తెలిసింది. కార్యక్రమాన్ని నిర్వహించిన రవాణాశాఖ మంత్రి భూపేంద్రసింగ్ శంకరాచార్య పీఠం నుంచి సాయాన్ని కోరారు. ఇందుకు ప్రతిఫలంగానే ట్యాక్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఒప్పందం కుదిరినట్లు ఏం మాట్లాడలేదు. -
బోల్తాకొట్టిన లగ్జరీ బస్సు
-
బోల్తాకొట్టిన లగ్జరీ బస్సు
అవుకు(కర్నూలు): వేగంగా వెళ్తున్న లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న లగ్జరీ బస్సు రిజర్వాయర్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. బస్సు రోడ్డుపక్కన ఉన్న గుంటలో పడిపోవడంతో.. బస్సులో ఉన్న 34 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేవు. -
రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి
సాక్షి ముంబై: వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు ఢీకొట్టుకోవడంతో సహా పూర్ రోడ్డుపై రక్తం ఏరులై పారింది. ముంబై-నాసిక్ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. దాదాపు సుమారు 30 మంది గాయపడ్డారు. సహాపూర్ సమీపంలో షిర్డీ నుంచి ముంబైకి బయలుదేరిన లగ్జరీ బస్సు, నాసిక్‌కు వెళుతున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో ఈ దురృటన చోటు జరిగింది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, 12 ఏళ్ల బాలుడు ఉన్నట్లు తెలిసింది. అడ్డమొచ్చిన ఒక బైకర్ నుంచి వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ అదుపుతప్పి ఇన్నోవాను ఢీకొన్నాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. షిర్డీ నుంచి భక్తులను తీసుకొని నీతా ట్రావెల్స్ బస్సు ముంబైకి బయలుదేరింది. మార్గమధ్యలో బైకర్ గ్రామంలోకి ప్రవేశించేందుకు రోడ్డు దాటుతున్నాడు. వేగంగా వెళుతున్న బస్సు డ్రైవర్ అతణ్ణి గమనించి తప్పించేం దుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి.. నాసిక్ దిశగా వెళుతున్న ఇనోవా కారును బలంగా ఢీకొన్నాడు. ఈ దుర్ఘుటనలో కారు నుజ్జునుజ్జయింది. దీంతో బైకర్ రామ్‌దాస్ వాంగణే తీవ్రంగా గాయపడ్డాడు. మృతుల ను బోరివలికి చెందిన వైభవ్ మహాడిక్ (12), జార్ఖండ్‌కు చెందిన కుం జలాల్ మహతో (20), చైన్నైవాసి గౌరీ కల్యాణ్ రమణ్ (55) గుర్తించారు. ఇన్నోవా కారులో ప్రయాణించిన ఒకే కుటుంబానికి చెందిన అనుజ దూబే (63), సంగీతా దూబే (45), కిరణ్ దూబే (19), సూరజ్ దూబే (15), సోనియాజైన్ కూడా మరణించారు. వీరితోపాటు దుర్మరణం పాలైన మరొకరి వివరాలు ఇంకా తెలియరాలేదు. బస్సులోని 20 మంది ప్రయాణికులు ఢిల్లీకి చెందినవారని, వారు ముంబై లాల్బాగ్చా రాజా దర్శనం నిమిత్తం వస్తున్నారని తెలిసింది. క్షతగాత్రులను ఠాణే సివిల్ ఆస్పత్రి, ఇతర ఆస్పత్రులకు తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బస్సు ప్రమాదంలో 38 మందికి గాయాలు విరార్ నుంచి కుడాళ్కు బయలుదేరిన మైత్రీ ట్రావె ల్స్ బస్సు శనివారం సాయంత్రం ముంబై-గోవా జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయింది. గణేశ్ ఉత్సవాల కోసం కొంకణ్‌కు బయలుదేరిన 38 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని చికిత్స కోసం వాలావల్కర్ ఆస్పత్రికి తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. వేగంగా వెళుతున్న బస్సులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది బోల్తా పడింది. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో అనేక మంది విరార్‌కు చెందినవారని తెలిసింది.