సాక్షి ముంబై: వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు ఢీకొట్టుకోవడంతో సహా పూర్ రోడ్డుపై రక్తం ఏరులై పారింది. ముంబై-నాసిక్ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. దాదాపు సుమారు 30 మంది గాయపడ్డారు. సహాపూర్ సమీపంలో షిర్డీ నుంచి ముంబైకి బయలుదేరిన లగ్జరీ బస్సు, నాసిక్‌కు వెళుతున్న ఇన్నోవా కారు ఢీకొనడంతో ఈ దురృటన చోటు జరిగింది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, 12 ఏళ్ల బాలుడు ఉన్నట్లు తెలిసింది. అడ్డమొచ్చిన ఒక బైకర్ నుంచి వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ అదుపుతప్పి ఇన్నోవాను ఢీకొన్నాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
షిర్డీ నుంచి భక్తులను తీసుకొని నీతా ట్రావెల్స్ బస్సు ముంబైకి బయలుదేరింది. మార్గమధ్యలో బైకర్ గ్రామంలోకి ప్రవేశించేందుకు రోడ్డు దాటుతున్నాడు. వేగంగా వెళుతున్న బస్సు డ్రైవర్ అతణ్ణి గమనించి తప్పించేం దుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి.. నాసిక్ దిశగా వెళుతున్న ఇనోవా కారును బలంగా ఢీకొన్నాడు. ఈ దుర్ఘుటనలో కారు నుజ్జునుజ్జయింది. దీంతో బైకర్ రామ్‌దాస్ వాంగణే తీవ్రంగా గాయపడ్డాడు.
మృతుల ను బోరివలికి చెందిన వైభవ్ మహాడిక్ (12), జార్ఖండ్‌కు చెందిన కుం జలాల్ మహతో (20), చైన్నైవాసి గౌరీ కల్యాణ్ రమణ్ (55) గుర్తించారు. ఇన్నోవా కారులో ప్రయాణించిన ఒకే కుటుంబానికి చెందిన అనుజ దూబే (63), సంగీతా దూబే (45), కిరణ్ దూబే (19), సూరజ్ దూబే (15), సోనియాజైన్ కూడా మరణించారు. వీరితోపాటు దుర్మరణం పాలైన మరొకరి వివరాలు ఇంకా తెలియరాలేదు. బస్సులోని 20 మంది ప్రయాణికులు ఢిల్లీకి చెందినవారని, వారు ముంబై లాల్‌బాగ్‌చా రాజా దర్శనం నిమిత్తం వస్తున్నారని తెలిసింది. క్షతగాత్రులను ఠాణే సివిల్ ఆస్పత్రి, ఇతర ఆస్పత్రులకు తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
బస్సు ప్రమాదంలో 38 మందికి గాయాలు
విరార్ నుంచి కుడాళ్‌కు బయలుదేరిన మైత్రీ ట్రావె ల్స్ బస్సు శనివారం సాయంత్రం ముంబై-గోవా జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయింది. గణేశ్ ఉత్సవాల కోసం కొంకణ్‌కు బయలుదేరిన 38 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని చికిత్స కోసం వాలావల్కర్ ఆస్పత్రికి తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. వేగంగా వెళుతున్న బస్సులో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది బోల్తా పడింది. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో అనేక మంది విరార్‌కు చెందినవారని తెలిసింది.
రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి
Published Mon, Sep 9 2013 12:39 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement