బాలీవుడ్ నటి కంగన రాజకీయాల్లోకి ప్రవేశించాక తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆమె జ్యోతిర్మఠం(ఉత్తరాఖండ్)నకు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇటీవల ముంబైలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని ఆరోపించారు. సనాతన ధర్మంలో ద్రోహం పెద్ద పాపమని పేర్కొన్నారు. అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యల నేపధ్యంలో కొందరు ఆయనను విమర్శిస్తుండగా, మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఈ ఉదంతంపై బాలీవుడ్ క్వీన్, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ కూడా స్పందించారు. ఎంపీ కంగనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు మద్దతు పలుకుతూ, అవిముక్తేశ్వరానందపై విమర్శలు చేశారు. శంకరాచార్య తన పదజాలంతో మతపరమైన విద్యను దుర్వినియోగం చేశారని కంగనా ఆరోపించారు.
కంగనా తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో..‘ రాజకీయాల్లో పొత్తు, పార్టీ విభజన అనేవి చాలా సాధారణమైన, రాజ్యాంగబద్ధమైన విషయాలని, 1907లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని, 1971లోనూ ఇలానే జరిగిందని, నేతలు రాజకీయాలు చేయకపోతే గోల్‌గప్పాలు (పానీపూరీలు) అమ్ముకోవాలా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను దేశద్రోహి అని వ్యాఖ్యానించిన శంకరాచార్య హిందూ ధర్మం గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు.
राजनीति में गठबंधन , संधि और एक पार्टी का विभाजन होना बहुत सामान्य और संवैधानिक बात है, कांग्रेस पार्टी का विभाजन 1907 में और फिर 1971 में हुआ, अगर राजनीति में राजनीतज्ञ राजनीति नहीं करेगा तो क्या गोलगप्पे बेचेगा?
शंकराचार्य जी ने उनकी शब्दावली और अपने प्रभाव और धार्मिक शिक्षा… https://t.co/UV2KuLwVUz— Kangana Ranaut (@KanganaTeam) July 17, 2024
Comments
Please login to add a commentAdd a comment