కంగనాపై వ్యాఖ్యలు, మండిపడ్డ హృతిక్ | Hrithik Roshan Slams 'Characterless Kangana' Trend on Twitter | Sakshi
Sakshi News home page

కంగనాపై వ్యాఖ్యలు, మండిపడ్డ హృతిక్

Published Mon, May 2 2016 11:23 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

కంగనాపై వ్యాఖ్యలు, మండిపడ్డ హృతిక్ - Sakshi

కంగనాపై వ్యాఖ్యలు, మండిపడ్డ హృతిక్

ముంబయి: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై ఓ వ్యక్తి  చేసిన వ్యాఖ్యల పట్ల హీరో హృతిక్ రోషన్ మండిపడ్డారు. కంగనాను ఆడిపోసుకుంటూ ట్విట్టర్లో వస్తున్న వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం వ్యక్తిత్వం లేని చర్య అని హృతిక్ మండిపడ్డారు. అది ఏదైనా అయి ఉండొచ్చని, అవసరం అయితే ప్రేమను పంచాలిగానీ ఇలా ఒకరిని బయటకు ఈడ్చడం అపాయకరమైన చర్య అని అన్నారు. హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరుగుతోందంటూ మీడియాలో కథనాలు వస్తుండగా.. అదేం లేదన్నట్లుగా హృతిక్ రోషన్ స్పందించారు. 

కంగనా రనౌత్కు హృతిక్ రోషన్ తో ఉన్న సంబంధాల గురించి కొంతమంది ట్విట్టర్లో అసభ్యకరమైన వ్యాఖ్యలు పెట్టారు. 'నేను కంగనా నటనను ఇష్టపడతాను. కానీ క్యారెక్టర్ లెస్ కంగనా దిగజారుడు జిమ్మిక్కులకు కాదు' అని ఓ ట్విట్టర్ యూజర్, 'ప్రచారం కోసం వివాదాస్పద అంశాన్ని కంగనా ఉపయోగించుకుంటుంది. ఇది చాలా దిగజారుడుతనం. క్యారెక్టర్ లెస్ కంగనా' అన మరో వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీనిపైనే హృతిక్ ఘాటుగానే స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement