
ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మన పక్కింటి వాళ్ల ఇల్లు కాలిపోతే రక్షించటానికి ఎంత మంది ముందుకొస్తారు చెప్పండి. అసలు ముందు సహాయం చేయడానికి ఎవ్వరైన వస్తున్నారో లేదో చూసి చేస్తాం లేదంటే లేదు అన్నట్టుగా ఉండిపోతారు. కానీ ఇక్కడొక అపార్ట్‌మెంట్ వాసులు తమ పక్కవాళ్ల ఖాళీ అపార్ట్‌మెంట్ బాల్కనీలో మంటలు చెలరేగుతాయి.
(చదవండి: రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!)
అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేంత వరకు వేచి ఉండకుండా అక్కడ ఉన్న ఇరుగు పొరుగ తమ వంతు ప్రయత్నంగా బకెట్ వాటర్‌తో ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నంలో వారు సఫలం అయ్యారు. అగ్నిమాపక వాహనం రాక మునుపే ఆ మంటలను అదుపులోకి తీసుకువచ్చేశారు. అయితే ఈ ఘటన జూలై 7, 2020న రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగింది. అయితే ప్రస్తతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు మనమంత ఇలానే కలిసి ఉండాలి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: 30 ఏళ్లుగా టాయిలెట్ నీటినే తాగారా!)
Comments
Please login to add a commentAdd a comment