burning house
-
Viral Video: అపార్ట్మెంట్లో మంటలు
-
అపార్ట్మెంట్లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!
ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మన పక్కింటి వాళ్ల ఇల్లు కాలిపోతే రక్షించటానికి ఎంత మంది ముందుకొస్తారు చెప్పండి. అసలు ముందు సహాయం చేయడానికి ఎవ్వరైన వస్తున్నారో లేదో చూసి చేస్తాం లేదంటే లేదు అన్నట్టుగా ఉండిపోతారు. కానీ ఇక్కడొక అపార్ట్మెంట్ వాసులు తమ పక్కవాళ్ల ఖాళీ అపార్ట్మెంట్ బాల్కనీలో మంటలు చెలరేగుతాయి. (చదవండి: రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!) అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేంత వరకు వేచి ఉండకుండా అక్కడ ఉన్న ఇరుగు పొరుగ తమ వంతు ప్రయత్నంగా బకెట్ వాటర్‌తో ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నంలో వారు సఫలం అయ్యారు. అగ్నిమాపక వాహనం రాక మునుపే ఆ మంటలను అదుపులోకి తీసుకువచ్చేశారు. అయితే ఈ ఘటన జూలై 7, 2020న రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగింది. అయితే ప్రస్తతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు మనమంత ఇలానే కలిసి ఉండాలి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: 30 ఏళ్లుగా టాయిలెట్ నీటినే తాగారా!) -
వైరల్ వీడియో: రియల్ హీరోస్.. అగ్నిప్రమాదం నుంచి ముగ్గురు చిన్న పిల్లలని..
-
ఇంట్లో ఒంటరిగా ముగ్గురు పిల్లలు; నిజమైన హీరోలు మీరే!
మాస్కో: సాధారణంగా మనం.. ఒక్కోసారి.. అనుకోని సంఘటనలు.. విపత్కర పరిస్థితులు చూస్తుంటాం. ఈ క్రమంలో, కొంత మంది స్పందిస్తే.. మరికొంత మంది మనకెందుకులే అనుకుని పట్టించుకోరు. ఇది మా పనికాదనో.. మాకేందుకు రిస్క్‌లే అనుకుని కనీసం ప్రయత్నం కూడా చేయరు. మరికొంత మంది మాత్రం.. తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి సాటివారిని కాపాడుతుంటారు. రష్యాలో ఇటీవల జరిగిన సంఘటన కూడా ఈ కోవకు చెందినదే. ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కొంత మంది పిల్లలు దాంట్లో చిక్కుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన కొంతమంది వెంటనే స్పందించి ఆ పిల్లలను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేవరకు వేచి చూడకుండా వారు తక్షణం స్పందించడంతో పిల్లలంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సాహసీకులు పిల్లలను కాపాడిన తీరు ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. వివరాలు.. రష్యాలోని కోస్ట్రోమా నగరంలో ఉన్న మూడంతస్తుల అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో మంటలు అపార్ట్మెంట్ చుట్టు వ్యాపించాయి. ప్రమాదం జరిగినప్పుడు అపార్ట్మెంట్లోని ఒక ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలు మాత్రమే ఉన్నారని తెలిసింది. దీంతో, ఇంటి పక్కన ఉన్న కొంత మంది యువకులు, ఆ పిల్లలను ఎలాగైన కాపాడాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో, ఆ ఇంటి ప్రవేశ ద్వారాన్ని పగుల గొట్టాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం సఫలం కాలేదు. మంటలు మాత్రం, వేగంగా వ్యాపిస్తున్నాయి. ఆ పిల్లలు ఇంట్లోని ఒక కిటికీ దగ్గరకు వచ్చి కాపాడాలని అరుస్తున్నారు. దీంతో వారికొక ఐడియా వచ్చింది. వెంటనే వారు అపార్ట్‌మెంట్‌కు ఆనుకొని ఉన్న ఒక పైపును పట్టుకొని, పిల్లలు చిక్కుకొని ఉన్న ఇంటి కిటికీ దగ్గరకు చేరుకున్నారు. వారంతా, ఒకరి తర్వాత మరోకరు చైన్ మాదిరిగా నిలబడ్డారు. ఈ క్రమంలో మొదటి వ్యక్తి, కిటికీ దగ్గర ఉన్న పిల్లలను చేరుకున్నారు. ఆ తర్వాత, వెంటనే కిటికీ నుంచి ఒకరి తర్వాత..మరొకరుగా.. ముగ్గురు పిల్లలను నెమ్మదిగా కిందకు దించారు. ఈ క్రమంలో, ముగ్గురు పిల్లలు క్షేమంగా కిందకు చేరడంతో అక్కడి వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే, ముగ్గురు పిల్లల ప్రాణాలను కాపాడిన వారిని అక్కడి అధికారులు సాహాస పురస్కారానికి నామినెట్ చేసినట్టుగా తెలిసింది. కాగా, ఆ ఇంట్లో ఉంటున్న సదరు, మహిళకు నలుగురు సంతానం. అగ్నిప్రమాదం జరగటానికి ముందు తన భర్తను ఇంట్లో ఉంచి, ఆమె ఏదో పనిమీద నాలుగో బిడ్డను తీసుకొని బయటకు వెళ్లింది. కాగా, ఆమె భర్త కూడా పిల్లలు పడుకున్నారని బయట తాళం వేసుకొని మరో పనిమీద బయటకు వెళ్లినట్టు తెలిసింది. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్..’, ‘ ముగ్గురి నిండు ప్రాణాలు కాపాడారు..’, ‘ ఇప్పటికీ మానవత్వం బతికే ఉందని ఇలాంటప్పుడే అనిపిస్తోంది..’, ‘ ఐకమత్యంగా ఉంటే గొప్ప పనులు సాధించొచ్చు.. అని మరోసారి రుజువైంది..’ ‘ నిజమైనా హీరోలు మీరే..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అదేమో కింగ్ కోబ్రా.. ఆ యువతి ఎలా పట్టేసుకుందో! -
ఉ. కొరియాలో అంతే!
హామ్‌గ్యాంగ్: ఉత్తరకొరియాలోని ఓ మహిళకు వింత ఘటన ఎదురైంది. దేశాధినేతల ఫొటోలను మంటల నుంచి రక్షించలేకపోయినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే హ్యామ్గ్యాంగ్ ప్రావిన్స్‌లోని ఒన్సోంగ్ కౌంటీలో ఓ ఇంటికి నిప్పంటుకుంది. అందులో ఉన్న ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. అయితే ఈ క్రమంలో దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుటుంబ సభ్యుల ఫొటోలను మంటల నుంచి కాపాడలేకపోయింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే 15 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. ఉత్తర కొరియా చట్టాల ప్రకారం ప్రతి ఇంట్లో కిమ్ పూర్వీకులైన కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ ఫొటోలను తప్పక ఉంచుకోవాలి. ఫొటోలను సరిగా చూసుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడూ అధికారులు ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారు మరి. అదీ కిమ్ రాజ్యంలోని ప్రజల తిప్పలు. -
సెల్ఫీలు తీసుకుని అడ్డంగా బుక్కయ్యారు!
-
సెల్ఫీలు తీసుకుని అడ్డంగా బుక్కయ్యారు!
న్యూయార్క్: ఓ వైపు ఇళ్లు కాలి బూడిదైపోతుందని ఫ్యామిలీ ఏడుస్తుంటే.. మరోవైపు బాధ్యత గల పోలీసు అధికారులు మాత్రం నింపాదిగా సెల్ఫీలు తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన న్యూయార్క్ శివార్లలో గత గురువారం చోటుచేసుకుంది. టూ లాంగ్ ఐలాండ్ ఆఫీసర్ల చేష్టలపై అక్కడ సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో అన్ లైన్లో విపరీతంగా షేర్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వీరిపై కచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కమిషనర్ థామస్ క్రంప్టర్ తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ మీడియా శనివారం ఇచ్చిన కథనంతో పోలీసుశాఖలో కదలిక వచ్చింది. ఈ ఘటనపై సంబంధిత కౌంటీ పోలీసు ఉన్నతాధికారి జేమ్స్ కార్వర్ ను మీడియా సంప్రదించగా ఆయన స్పందించలేదు. కెవన్ అబ్రహం అనే అధికారి మాత్రం వీరి చర్యలను వృత్తిలో ఆ పోలీసుల నిబద్ధతను తెలియజేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసుశాఖ తెలిపింది. పోలీసులు బాధిత కుటుంబానికి సహాయం చేశారని, వారిపై చర్యలు తీసుకునే అవకాశం తక్కువేనని పక్క ఇంట్లో ఉండే వృద్ధురాలు ఎమ్మా జక్కారిని అభిప్రాయపడ్డారు. భారీ ఆస్తినష్టం సంభవించిందని, ప్రాణ నష్టం మాత్రం జరగలేదని అగ్నిమాపక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
పాలకోడేరు : వేండ్ర గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్‌తో ఒక గృహం దగ్ధమవడంతో రూ.లక్షకు పైగా ఆస్తినష్టం సంభవించింది. సానుబోయిన మధు రేకుల ఇంటిలో నివసిస్తున్నారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కట్టుబట్టలతో బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నామని మధు తెలిపారు. ఇంట్లో గృహోపకరణాలు, గ్యాస్ సిలిండర్లు, బట్టలు అన్ని దగ్ధయ్యాయని ఆయన బోరున విలపిస్తున్నాడు. వీఆర్వో రాజు వచ్చి ఆస్తినష్టాన్ని ధ్రువీకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ జి. రత్నమణి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉప సర్పంచ్ భూపతి రాజు చంటి రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి బియ్యం, తదితర సామగ్రిని బాధిత కుటుంబానికి అందజేశారు.