
హత్యాచారం చేసి.. వంటపాత్రలో కుక్కి
సేలం : తమిళనాడులోని సేలం జిల్లాలో 16 ఏళ్ల బాలుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతునులిమి చంపాడు. మృతదేహాన్ని వంటపాత్రలో కుక్కి, తన ఇంట్లోని పూజగదిలో దాచాడు. చిన్నారి ఇంటి పక్కనే నివసించే నిందితుడు శనివారం పాపకు మిఠాయి ఆశచూపి తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
పాప ఎవరికైనా చెబుతుందేమోననే భయంతో గొంతు పిసికి చంపి, వంటపాత్రలో దాచాడు. పాప కనిపించడం లేదని ఆమె తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపను ఇంటిపక్కన ఉండే అబ్బాయి తీసుకెళ్లినట్లు విచారణలో స్థానికులు చెప్పారు. ఇంట్లో శవం దొరకడంతో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. కోర్టు అతనికి కస్టడీ విధించింది.