
సాక్షి, చెన్నై : పార్టీని బలోపేతం చేసే దిశగా మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్ చర్యలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు శిబిరాల్ని విస్తృతంగా ఏర్పాటు చేయాలని పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌లను ఆదేశించారు. సోమవారం జిల్లాల ఇన్‌చార్జ్‌లతో ఆళ్వార్‌పేటలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
అభిమానుల సహకారంతో మక్కల్ నీది మయ్యం లక్ష్యాలను , ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సభ్యులుగా చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువత కమల్‌కు మద్దతు తెలియజేస్తూ, మక్కల్ నీది మయ్యంలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment