చెన్నై: తమిళనాడులో త్వరలో 20 అసెంబ్లీ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించనుందని నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ(ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ వెల్లడించారు. ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పర్యటిస్తున్న కమల్ హాసన్ విలేకరులు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు. టీటీవీ దినకరన్ వర్గంలో చేరిన 18మంది ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును ఇటీవల మద్రాస్ హైకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. దీంతోపాటు డీఎంకే అధినేత కరుణానిధి, ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మరణంతో రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఏర్పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment