ఫ్యాన్స్‌ అత్యుత్సాహం: ఆస్పత్రిలో కమల్!‌ | MNM Chief Kamal Haasan On Bed Rest After Leg Pain In Election Campaign | Sakshi
Sakshi News home page

ప్రచారంలో కమల్‌ హాసన్‌ కాలికి గాయం

Published Sun, Mar 21 2021 12:32 PM | Last Updated on Sun, Mar 21 2021 3:49 PM

MNM Chief Kamal Haasan On Bed Rest After Leg Pain In Election Campaign - Sakshi

చెన్నై: అభిమానుల ప్రేమకు హద్దూ అదుపూ ఉండదు. అభిమాన తార కళ్లముందు కనిపిస్తే చాలు.. వారి ఆనందం వర్ణించ వశం కాదు. సెలబ్రిటీలతో సెల్ఫీ దిగాలని, వారికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వాలని, కుదిరితే కబుర్లు కూడా చెప్పాలని తహతహలాడిపోతుంటారు. కానీ వీరి అత్యుత్సాహం కొన్నిసార్లు హీరోలకు తలనొప్పిగా మారుతుంది. ఇదిగో ఇలాంటి అనుభవమే తమిళ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌కు ఎదురైంది. తమిళనాడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ నుంచి ప్రచారం స్పీడు పెంచాడు కమల్‌. తను పోటీ చేస్తున్న కోయంబత్తూర్‌లో వరుస ప్రచారాలు చేపడుతూ అభిమానుల్లో జోష్‌ నింపుతున్నాడు.

ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో శనివారం నాడు మార్నింగ్‌ వాక్‌కు వెళ్లి అక్కడి స్థానికులను పలకరించాడాయన. ఈ విషయం తెలిసిన అభిమానులు హీరోను చుట్టుముట్టారు. సెల్ఫీలంటూ ఎగబడ్డారు. అందరితో ఓపికగా సెల్ఫీలు దిగుతుండగా చిన్న తోపులాట జరిగి ఓ వ్యక్తి కమల్‌ కుడి కాలిని తొక్కాడట. ఈ ఏడాది ప్రారంభంలో అదే కాలికి శస్త్రచికిత్స జరగడంతో కమల్‌ నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి కాలికి ఎక్స్‌రే తీశారు. అనంతరం అతడిని పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: కమల్‌ కారుపై దాడి; చితక్కొట్టిన కార్యకర్తలు

కమల్‌కు షాక్‌: రూ.11 కోట్లు సీజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement