
తమిళనాడు, పెరంబూరు: మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌పై అన్నాడీఎంకే తరఫున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలిపి వారి తరఫున రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాలక పక్షం అన్నాడీఎంకే, ప్రతిపక్షం డీఎంకే నాయకులపై అవినీతి ఆరోపణలను గుప్పించారు. కాగా మంగళవారంతో ప్రచారం ముగియడంతో ఆయన అదే రోజు పలు ప్రముఖ దినపత్రికలకు ఫుల్‌పేజీలతో కూడిన ప్రకటనలను ఇచ్చా రు. అయితే ఆ ప్రకటనల్లో తూత్తుకుడి సం ఘటనకు సంబంధించిన ఫొటోలను పొం దుపరచడంతో అన్నాడీఎంకే పార్టీ వారు అభ్యంతరం తెలిపారు. ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లవుతుందని ఆ సంఘానికి కమలహాసన్‌పై ఫిర్యాదు చేశారు.