కమల్‌ కేబినెట్‌ మంత్రులను చూస్తే షాకే? | Twitter Joins Kamal Haasan Political Party | Sakshi
Sakshi News home page

కమల్‌ కేబినెట్‌ మంత్రులను చూస్తే షాకే?

Feb 22 2018 6:02 PM | Updated on Feb 22 2018 8:09 PM

Twitter Joins Kamal Haasan Political Party - Sakshi

కమల్‌ కేబినెట్‌ ఇదేనంటూ ట్విటర్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సరదా ఫొటో

సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ నటుడిగా మారి బుధవారం అట్టహాసంగా 'మక్కళ్‌ నీది మయ్యం'(ప్రజా న్యాయ వేదిక) అనే కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ప్రారంభించగానే ఇదే ప్రజల పార్టీ అని, వారు చెప్పిన ప్రకారమే సేవ చేసేందుకు తాను పార్టీ పెట్టానని, ఎలాంటి సేవ కావాలో ప్రజలు ఆదేశిస్తే తాము పని చేస్తామని కమల్‌ వ్యాఖ్యలు చేశారు కూడా. అయితే, అన్ని సందర్భాల మాదిరిగానే ఈ సందర్భంలో కూడా ట్విటర్లో జోరుగా కమల్‌ పార్టీకి ప్రచారం మొదలుపెట్టారు. అయితే, అది సీరియస్‌గా కాదు.. టపటపా జోకులు పేలుస్తూ..

కమల్‌ వివిధ చిత్రాల్లో నటించిన వేషాలకు సంబంధించిన చిత్రాలన్ని ఒక వరుసలో పేరుస్తూ వీరంతా కమల్‌ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులంటూ ఓ వ్యక్తి పంచుకోగా.. అబ్దుల్‌ కలాం ఇంకా చనిపోలేదంటూ కమల్‌ను కలాంగా మార్చిన ఫొటోను ట్విట్‌ చేస్తూ మరో వ్యక్తి... అలాగే.. కమల్‌, కేజ్రీవాల్‌ మాట్లాడుకుంటున్న ఫొటోను పెట్టి మీరు గొప్ప నటుడు అని కేజ్రీవాల్‌ అనగా అచ్చం మీరు కూడా నాలాగే అని కమల్‌ కేజ్రీవాల్‌ను అన్నట్లుగా కామెంట్లతో మరొకరు.. ఇక వివిధ సినిమాల్లోని క్యారెక్టర్ల ఫొటోలకు తెల్ల లుంగీలు చొక్కాలు వేసుకున్న ఫొటోను పంచుకొని ఇదే తమిళనాడు తదుపరి కేబినెట్‌ అని ఇలా వరుసగా జోకులు పేలాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement