
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ పార్టీ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. రజనీకాంత్ మక్కల్ మన్రం అనే వేదికను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న పార్టీ పేరు వెలువడుతుందని, వెంటనే భారీ ఎత్తున సభ జరుగుతుందని రజనీ వర్గాలు ప్రచారం చేశాయి. కావేరి వివాదం, ఇంకా అనేక అంశాలపై ఆందోళనలు జరుగుతున్న తరుణంలో పార్టీ ఏర్పాటుకు ఇది సమయం కాదని ఇటీవల మక్కల్ మన్రం ఇన్‌చార్జ్‌లు రజనీకి సలహా ఇచ్చినట్లు సమాచారం.