చెన్నై: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవటంతో తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత, అగ్ర నటుడు కమల్ హాసన్ బుధవారం తన పార్టీ ఎన్నికల ఎజెండాను వెల్లడించారు. మహిళల సంక్షేమానికి తమ పార్టీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. మహిళ రక్షణ కోసం 181 హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే గ్రామీణ బ్యాంక్‌లను మహిళా పథకాల ఆధ్వర్యంలో నిర్వహించేలా కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తాని ఎంఎన్‌ఎం పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించింది. ఆయన బుధవారం రాత్రి ఓ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
కమల్ హాసన్ ఇటీవల తనకు మద్దతు పలకాలని పలువురు సినీ ప్రముఖులను కలిసిన విషయం తెలిసిందే. ఆలిండియా సముత్వ మక్కల్ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్‌కుమార్‌తో పాటు ఇందిరా జననయాగ కట్చీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి తాను మూడో కూటమిని తయారు చేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. అదే విధంగా ఆ కూటమి సీఎం అభ్యర్థిని తనే అని వెల్లడించారు. ఇక 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment